నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

First Published Jan 5, 2023, 2:56 PM IST

ఖర్జూరాల్లో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మాత్రమే కాదు విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, జింక్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే.. 
 

dates

ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఖర్జూరాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఖర్జూరంలో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు మాత్రమే కాదు..  విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 2, విటమిన్ బి 3, విటమిన్ బి 5 ఎ 1 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇననీ కాదు.. అవేంటంటే..


గుండె ఆరోగ్యానికి మంచిది

నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయి. ఖర్జూరాల్లో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల వీటిని తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కానీ వీటిని మితంగానే తినాల్సి ఉంటుంది. 
 

dates

మలబద్దకం తగ్గుతుంది

ఖర్జూరాలను నానబెట్టి తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ సులభతరం అవుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

dates

ఎముకల బలం పెరుగుతుంది

ఖర్జూరాల్లో ఉండే విటమిన్లు ఎముకలు, కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఖర్జూరాలు అలసట నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా సహాయపడతాయి. అలాగే కండరాల బలాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఈ ఖర్జూరాలు రక్తహీనతను నివారించడానికి కూడా తోడ్పడుతాయి. ఖర్జూరాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ తో పోరాడుతాయి. మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఖర్జూరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 

dates

మధుమేహులకు

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తిన్నా.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఖర్జూరాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఏదేమైనా షుగర్ పేషెంట్లు వీటిని తినాలంటే.. ముందు డాక్టర్ ను సంప్రదించండి. అలాగే రోజుకు రెండు లేదా మూడు ఖర్జూరాలను మాత్రమే తినాల్సి ఉంటుంది. 
 

dates

చర్మ సమస్యలు

ఖర్జూరాల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే దీనిలో ఉండే విటమిన్ డి, విటమిన్ సి లు ఎన్నోచర్మ సమస్యలను దూరం చేస్తాయి. స్కిన్ కూడా అందంగా మెరిసిపోతుంది. అందుకే నానబెట్టిన ఖర్జూరాలను రెగ్యులర్ గా మీ డైట్ లో  చేర్చుకోండి. 
 

click me!