చలికాలంలో కరివేపాకును తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..?

First Published Dec 5, 2022, 12:52 PM IST

కరివేపాకును సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే ఇవి రుచిగా ఉండటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిని శీతాకాలంలో తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. 

కరివేపాకును వంటల్లో ఖచ్చితంగా వేస్తుంటారు. కానీ తినను మాత్రం తినరు. కానీ కరివేపాకును తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు రుచిగా ఉండటమే కాదు.. దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి.  కరివేపాకులో పిండి పదార్థాలు, కాల్షియం, ఫైబర్, ఇనుము, భాస్వరం, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే హార్ట్ పనితీరును మెరుగుపరుస్తాయి. కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి విరేచనాలను తగ్గిస్తాయి. అలాగే జీర్ణసమస్యలను పోగొడుతాయి. చలికాలంలో కరివేపాకును తినడం వల్లకలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మధుమేహానికి నియంత్రిస్తుంది

మధుమేహులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. కాగా మధుమేహులకు కరివేపాకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మధుమేహుల శరీరం ఇన్సులిన్ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు కరివేపాకును తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు. 
 


కడుపునొప్పిని తగ్గిస్తుంది

కరివేపాకు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఇది కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఈ ఆకులు ప్రేగు కదలికలకు కూడా సహాయపడతాయి. అలాగే జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కరివేపాకు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్, గుండెకు సంబంధించిన ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కరివేపాకు ఎంతో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే కరివేపాకు ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ ఆక్సీకరణను ఆపుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు తప్పకుండా వీటిని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ తో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలు రావొచ్చు. అయితే కరివేపాకును తింటే ఇలాంటి సమస్యల  ముప్పు తప్పుతుంది. ఎందుకంటే  కరివేపాకు జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో శరీరం పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కరగడం మొదలవుతుంది. కరివేపాకు వల్ల మీరు తొందరగా బరువు తగ్గుతారు. 
 


తెల్ల జుట్టును నివారిస్తుంది

ఈ రోజుల్లో చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. కానీ కరివేపాకు జుట్టు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదండోయ్ ఈ కరివేపాకు చుండ్రును  తగ్గిస్తుంది. అలాగే దెబ్బతిన్న జుట్టును నయం చేస్తుంది. బలహీనమైన జుట్టును తిరిగి బలంగా చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆకులు జుట్ట రాలడాన్ని ఆపడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 
 

మార్నింగ్ సిక్ నెస్ కు సహాయపడుతుంది

గర్భిణీ స్త్రీలలు వారి మొదటి త్రైమాసికంలో మార్నింగ్ సిక్నెస్,  వాంతులతో ఇబ్బందది పడుతుంటారు. ఈ సమస్యల నుంచి గట్టెక్కడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. 

రుచిగల కరివేపాకులలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి, అలాగే శరీరక ఎదుగుదల బాగుండటానికి, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

click me!