గొంతునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? తగ్గాలంటే ఇలా చేయండి..

First Published Dec 5, 2022, 11:48 AM IST

సమతుల్య ఆహారం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే మన శరీరం అంతర్గతంగా బలంగా ఉంటుంది. దీంతో ఎలాంటి శారీరక సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయి. 
 

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా గొంతునొప్పి రావడం సర్వ సాధారణ విషయం. ఈ గొంతునొప్పికి వాయుకాలుష్యమే ప్రధాన కారమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది ఫ్లూలా కాకుండా.. ఈ నొప్పి ఎక్కువ రోజులు ఉంటుంది. దీనికి ఇతరకారణాలేమైనప్పటికీ దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకుంటేనే మంచిది. సమతుల్య ఆహారం తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా శరీరం అంతర్గతంగా బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. గొంతునొప్పి కూడా తగ్గిపోతుంది. 

గొంతునొప్పి లక్షణాలు

మింగడానికి ఇబ్బంది కలుగుతుంది

గొంతులో నొప్పి

వాపు కారణంగా చికాకు

దగ్గు
 


గోరువెచ్చని నీటితో  గార్గిల్

గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే కూడా గొంతునొప్పి తగ్గిపోతుంది. ఇందుకోసం గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పువేసి పుక్కిలించినా లేదా మింగినా గొంతునొప్పి తగ్గిపోతుంది.  

చిటికెడ్ ఉప్పు కలిపిన పసుపు నీటిని తాగితే మంట చాలా వరకు తగ్గిపోతుంది. 

తులసి ఆకులు మరిగించిన నీటిని తాగితే కూడా గొంతునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటిని రోజుకు 2-3 సార్లు చేయాలి. గొంతునొప్పి లక్షణాలు మరీ ఎక్కువైతే ప్రతి రెండు గంటలకొకసారి చేయొచ్చు. 
 

honey

తేనె

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి గాయాలను త్వరగా నయం చేస్తాయి. అలాగే ఈ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో తేనెను మేసుకుని తాగండి. ఈ వాటర్ మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది కూడా. 

నిమ్మకాయ, గోరువెచ్చని నీరు

నిమ్మకాయ సిట్రిక్ పండు. దీని రుచి గొంతును చికాకుపెడుతుంది. నిమ్మకాయ కఫం, శ్మేష్మం బయటకు పోయేందుకు సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయ నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఈ సిట్రస్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది  మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇదొక బలమైన యాంటీ ఆక్సిడెంట్.
 

chamomile tea

గ్రీన్ టీ

లవంగం లేదా గ్రీన్ టీ కూడా గొంతునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో బలమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలు గొంతునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే సంక్రమణతో పోరాడటానికి సహాయపడతాయి. 

చమోమిలే టీ సహజ కందెనగా పనిచేస్తుంది. ఇది నరాలకు ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు రాత్రిళ్లు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. గొంతునొప్పిని తగ్గించుకోవడానికి  ఇది ఉత్తమ నివారణ. పిప్పరమింట్ టీ నొప్పిని, తిమ్మిరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ టీని కూడా ప్రయత్నించండి.
 

మూలికలు 

శతాబ్దాలుగా గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి మూలికలను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు. వాటిని నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టడం వల్ల కషాయం తయారవుతుంది. దీనిని దగ్గు సిరప్ లాగా తీసుకోవచ్చు. త్రిఫాలా పొడిని రాత్రంతా నీటిలో నానబెట్టి.. వడకట్టి తీసుకోవచ్చు. త్రిఫలలో ఇతర యాంటీఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. 
 

curd

పెరుగులో ప్రోబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే గొంతునొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇందుకోసం పెరుగును గది ఉష్ణోగ్రత వద్ద తీసుకోండి. దగ్గు, జలుబులు కాలాలు మారుతుంటే వచ్చే సర్వసాధారణ సమస్యలు. చాలా రోజుకు బాధిస్తుంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెల్లండి. 

click me!