ఇడ్లీ సాంబార్ తో ఎంచక్కా బరువు తగ్గొచ్చు తెలుసా?

First Published Dec 5, 2022, 10:48 AM IST

వేడి ఇడ్లీలను సాంబార్ లో ముంచుకుని తింటుంటే.. అబ్బా ఆ రుచిని మాటల్లో చెప్పడం కష్టమే. మీకో విషయం తెలుసా..  బరువు తగ్గడానికి ఫర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందా అంటే అది ఇడ్లీ సాంబార్ అనే చెప్పాలి. 
 

బరువు తగ్గడం ఎంత కష్టమో.. ప్రయత్నిస్తున్న వాళ్లను అడిగితే తెలుస్తుంది. నిజానికి బరువు పెరగడమంత ఈజీగా తగ్గలేం. దీనికి చాలా ఓపిక కావాలి. కానీ ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ లేదు. అది బరువు తగ్గడమైనా కావొచ్చు.. మరేదైనా కావొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలంటే ముందుగా మన లైఫ్ స్టైల్ లో కొన్ని అలవాట్లను మార్చుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ఏవి పడితే అవి తినకూడదు. వీటిని ఫాలో అవ్వడం అంత సులువైనన విషయం కాదు. నిజానికి బరువు తగ్గడాన్ని మీరు ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నింటిని పక్కాగా ఫాలో అయితే మీరనుకున్న విధంగా బరువు తగ్గుతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇడ్లీ సాంబార్ కూడా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

చాలా మంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ ఒకటి. దక్షిణ భారతదేశంలో ఇడ్లీలను ఎక్కువగా తింటుంటారు. కొబ్బరి చట్నీ.. కమ్మని సాంబార్ తో ఇడ్లీలను తింటుంటే బలే ఉంటుంది. నిజానికి ఇడ్లీల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఇడ్లీలను తయారుచేయడానికి బియ్యం ఎక్కువగా అవసరమవుతాయి. అయితే మీరు కార్భోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలనుకుంటే  మీరు బియ్యం మొత్తాన్ని తగ్గించి మినపప్పు మొత్తాన్ని పెంచొచ్చు. ఈ పిండిలో కూరగాయలు, ఆరోగ్యకరమైన సుంగధ ద్రవ్యాలను కూడా వేయొచ్చు. 

వీటితో పాటు మినపప్పు ఇడ్లీ, ఓట్ ఇడ్లీలు కూడా మీరు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. సాంప్రదాయ ఇడ్లీకి ఓట్స్ ఇడ్లీ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఓట్స్  లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో తిన్నా.. అతిగా తినకుండా చేస్తాయి. 
 

ఇడ్లీలను పులియబెట్టిన పిండితో తయారుచేస్తారు. కిణ్వ ప్రక్రియకు గురైన ఆహారాలను తినడం వల్ల మన శరీరంలోని విటమిన్లు, ఖనిజాలు బాగా విచ్ఛిన్నం అవుతాయి. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు పులియబెట్టిన ఆహారాల్లో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా పేగులలోని పీహెచ్ సమతుల్యతను మారుస్తుంది. ఇది దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 

ఇక సాంబార్ విషయానికొస్తే.. దీనిలో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది. మీరు మరింత వేగంగా బరువు తగ్గాలనుకుంటే సాంబార్ లో కూరగాయలను ఎక్కువగా వేయండి. 

అయితే మీ శరీరంలో పిండి పదార్థాలు పేరుకుపోకుండా ఉండాలంటే నిపుణులు ఇడ్లీ పిండికి కొంత సిట్రస్ రసాన్ని జోడించాలని నిపుణులు సలహానిస్తున్నారు.
 

click me!