క్యాబేజీని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. నూడుల్స్, మంచురియా వంటి వాటిలో ఎక్కువగా వాడుతుంటారు. క్యాబేజీ వల్ల వంటలు టేస్టీగా అవుతాయి. కానీ క్యాబేజీ కూర అంత టేస్టీగా కాదు. కానీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటీరీ లక్షణాలుంటాయి. దీనిలో పీచుపదార్థాలు, రైబోఫ్లేవిన్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, నియాసిన్, కాల్షియం, భాస్వరం, ఇనుము, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. క్యాబేజీ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..