ఈ వయసున్నోళ్లు గుడ్లను ఖచ్చితంగా తినాలి.. లేకపోతే ఒంట్లో బలముండదు..

Published : Dec 05, 2022, 05:00 PM IST

సండే కానీ.. మండే కానీ రోజూ తినండి గుడ్డు అన్న టీవీ యాడ్ ను రోజూ చూస్తూనే ఉంటాయి. నిజానికి గుడ్లను అన్ని వయసుల వారు ఖచ్చితంగా తినాలి. అప్పుడే శరీరానికి బలం అందుతుంది.   

PREV
15
ఈ వయసున్నోళ్లు గుడ్లను ఖచ్చితంగా తినాలి.. లేకపోతే ఒంట్లో బలముండదు..
egg

గుడ్డును సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. చాలా మంది గుడ్లను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో రొట్టెతో తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే గుడ్లను చాలా ఫాస్ట్ గా వండొచ్చు. రోజూ జిమ్ముకు వెళ్లే వారు గుడ్లను ఖచ్చితంగా తింటుంటారు. అది కూడా తెల్ల సొనను మాత్రమే. పచ్చసొన బరువును పెంచుతుందని పక్కన పెట్టేస్తుంటారు. కానీ రోజూ ఒకగుడ్డును మొత్తం తినడం వల్ల కొంచెం కూడా బరువు పెరగరు. నిజానికి అన్ని వయసుల వారు గుడ్లను తినొచ్చు. గుడ్లను తినడం వల్ల శరీరానికి బలం అందుతుంది. 

25

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 40 ఏండ్ల పైబడిన వారు ఖచ్చితంగా గుడ్లను తినాలని చెబుతున్నారు. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. తరచుగా కండరాల్లో నొప్పి పుడుతుంది. అలాగే శరీరం బలహీనపడుతుంది. అందుకే ఈ వయసు వారు ఖచ్చితంగా గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పోషకాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్లను తినడం వల్ల ప్రోటీన్ల అవసరం తీరుతుంది. అలాగే వీరి శరీరానికి కావాల్సిన విటమిన్లు, కాల్షియం అందుతుంది. 

35

ఉడికించిన గుడ్లను తింటే శరీరానికి 6.3 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. కేలరీలు 77, 212 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ , 0.6 గ్రాముల పిండి పదార్థాలు, 5.3 ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా విటమిన్ ఎ, సెలీనియం, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ డి , ఫాస్పరస్ లు అందుతాయి. అందుకే గుడ్డును ఖచ్చితంగా తినాలంటారు నిపుణులు. 
 

45

మధ్య వయస్కుల వారికి విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం అందకపోతే శరీరం బలహీనంగా మారుతుంది. ఏ పనీ చేతకాదు. అందుకే 40 ఏండ్ల వారు ఖచ్చితంగా గుడ్లను డైట్ లో చేర్చుకోవాలి. 
 

55

రోజుకు ఎన్ని గుడ్లను తినాలి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 40 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయస్సున్న వాళ్లు వారానికి కనీసం 7 గుడ్లను ఖచ్చితంగా తినాలి. రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories