అంటువ్యాధులను నివారించడానికి
రోజ్ వాటర్ లో శక్తివంతమైన క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. అలాగే ఇన్ఫెక్షన్లను తొందరగా తగ్గిస్తాయి. అందుకే రోజ్ వాటర్ ను తరచుగా వివిధ సహజ, ఔషధ చికిత్సలలో ఉపయోగిస్తారు. కండ్లకలకు తగ్గించడానికి వాడే కంటి చుక్కలలో రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారన్న సంగతి మీకు తెలుసా? రోజ్ వాటర్ లో ఉండే క్రిమినాశక, అనాల్జేసిక్ లక్షణాలు కంటి వ్యాధులను తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.