2023లో సంతోషంగా ఉండేందుకు సింపుల్ చిట్కాలు..!

Published : Jan 02, 2023, 03:59 PM IST

కేవలం ఇంట్లో ఆహారం మాత్రమే తినాలి అనే కండిషన్ పెట్టుకోవాలి. అందుకు తగినట్లు ప్రవర్తించాలి. మీ బాడీ కరెక్ట్ గా ఉండేందుకు ఇంట్లో ఆహారం తినడం ఉత్తమం.

PREV
110
2023లో సంతోషంగా ఉండేందుకు సింపుల్ చిట్కాలు..!
new year

సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... దనాి కోసం ఏం చేయాలో చాలా మందికి ఒక క్లారిటీ ఉండదు.  ఈ నూతన సంవత్సరంలో మీరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటే... ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

210
sleep job

1.ముందుగా... సరైన నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. టైమ్ కి పడుకొని.. టైమ్ కి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల.. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాం.

310

2.ఏ రోజు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ముందెప్పుడూ మీరు మీ ప్లాన్ చేసుకోకపోతే...  ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాలి. కనీసం రెండు వారాలు మర్చిపోకుండా చేసుకుంటే.... అది మీకు అలవాటు అవుతుంది. ఎలాంటి గజిబిజీ లేకుండా గడిచిపోవడానికి ఈ ప్లానింగ్ మీకు ఉపయోగపడుతుంది.

410
Battle Rope

3.ఆరోగ్యంగా ఉండేందుకు... బయటి ఆహారానికి చెక్ పెట్టాలి. కేవలం ఇంట్లో ఆహారం మాత్రమే తినాలి అనే కండిషన్ పెట్టుకోవాలి. అందుకు తగినట్లు ప్రవర్తించాలి. మీ బాడీ కరెక్ట్ గా ఉండేందుకు ఇంట్లో ఆహారం తినడం ఉత్తమం.

4.జిమ్ కి వెళ్లి... వర్కౌట్స్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేనివారు.. ఇంట్లోనే వర్కౌట్స్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఒంటికి వ్యాయామం చాలా మంచిది. యోగా, జుంబా డ్యాన్స్.. ఇలా ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోవాలి.
 

510
helping hands

5.ఎప్పుడూ...ఇళ్లు, పనే కాకుండా.. సామాజిక కార్యక్రమాల పై కూడా దృష్టి పెట్టాలి. ఏదైనా ఎన్జీవో కి సహాయం చేయడం, వాలంటీర్ గా పని చేయడం లాంటి పనులు చేయాలి. మనసుకు కూడా సంతోషం కలుగుతుంది.

610

6.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పై  ఎక్కువ దృష్టి పెట్టాలి. దాని కోసం మంచి నీరు ఎక్కువగా తాగాలి. ఈ ఏడాది డీ హైడ్రేషన్  సమస్య లేకుండా.. మంచినీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి.

710


7.పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది.  అలవాటుు ఉన్నవారు కంటిన్యూ చేయాలి. లేనివారు అలవాటు చేసుకోవడం ఉత్తమం.

810

8.చాలా మంది తమ ఫ్యామిలీని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. కానీ... ఈ సంవత్సరం మీ ఫ్యామిలీతో గడపడం అలవాటు చేసుకోవాలి. వారిని ఇగ్నోర్ చేయకుండా... వారికి సమయం కేటాయించాలి. అలాగే... స్నేహితులతో కూడా కలిసి పార్టీలు, లంచ్ లు చేస్తూ ఉండాలి.

910

9. మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోవాలి. మ్యూజిక్ వినడం వల్ల.. సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి... ఇది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా పండ్లు తినడం రోజులో భాగం చేసుకోవాలి.
 

1010

10.కోపం మనలో చాలా మందికి ఊరికే వస్తూ ఉంటుంది. ఈ కోపం కారణంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. కాబట్టి.... కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మెెడిటేషన్ కూడా చేయడం  చాలా మంచిది.
 

Read more Photos on
click me!

Recommended Stories