ఖర్జూరాలు, అత్తి పండ్లు, ఎండుద్రాక్ష
ఖర్జూరాలు, అత్తిపండ్లు, ఎండుద్రాక్ష పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిలో ఇనుము, మెగ్నీషియం, రాగి, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టిన 2 లేదా 3 ఖర్జూరాలు, 2 అత్తి పండ్లు, ఒక టేబుల్ స్పూన్ ఎండుద్రాక్షలను అల్పాహారంగా తీసుకోండి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే మీ శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతాయి.