ఈ వ్యాధులతో బాధపడేవాళ్లు కొబ్బరి నీళ్లను రోజూ తాగాలట..

First Published | Dec 4, 2022, 11:56 AM IST

కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని వ్యాధులతో బాధపడేవారు కొబ్బరినీళ్లను రోజూ తప్పకుండా తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. 
 

కొబ్బరి నీళ్లంటే ఇష్టం లేనివారుండరు. నిజానికి కొబ్బరినీళ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే వీటిని రోజూ తాగాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. కానీ చాలా మంది ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రమే కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. కొబ్బరి నీళ్లను తాగితే శరీరంలో నీటి కొరత ఉండదు. అలాగే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అందుకే కొబ్బరి బోండాలకు పట్టణాల నుంచి పల్లెల వరకు మంచి గిరాకీ ఉంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఏయే రోగాలు తగ్గిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఊబకాయం

నిజానికి ఊబకాయం వ్యాధి కాదు. కానీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడతాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగడం వల్ల మీ శరీర ఆకారంలో మార్పును గమనిస్తారు. 
 


అధిక రక్తపోటు

అధిక రక్తపోటు పేషెంట్లు కూడా కొబ్బరి నీళ్లను రోజూ తాగాలని ఆరోగ్య నిణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత కొవ్వు తగ్గడం మొదలవుతుంది. దీంతో రక్తపోటు సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అందుకే హై బీపీ పేషెంట్లు కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగాలి. 
 

హార్ట్ పేషెంట్లు

ఇండియాలో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. హార్ట్ పేషెంట్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ పేషెంట్లు కూడా కొబ్బరినీళ్లను క్రమం తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు గుండెపోటు, స్ట్రోక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

రోగనిరోధక శక్తి 

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రోగనిరోధక శక్తి ఎంత అవసరమో జనాలకు తెలిసొచ్చింది. నిజానికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే లేనిపోని రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే  ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలనే తీసుకోవాలి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే అంటువ్యాధులు, ఇతర రోగాలు సోకే ముప్పు కూడా తప్పుతుంది. 

Latest Videos

click me!