చలికాలంలో నల్ల నువ్వులను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..? ఆ రోగాలన్నీ తగ్గిపోతాయట..

Published : Nov 13, 2022, 12:53 PM IST

చలికాలంలో చాలా మంది తల్లులు పిల్లలకు నల్ల నువ్వుల లడ్డూలు చేసి పెడుతుంటారు. ఈ ఆచారం అమ్మమ్మ కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. చలికాలంలో నల్ల నువ్వులను తినడం కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

PREV
16
 చలికాలంలో నల్ల నువ్వులను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా..? ఆ రోగాలన్నీ తగ్గిపోతాయట..

నల్ల నువ్వుల లడ్డూలను అమ్మమ్మల కాలం నుంచీ తయారుచేస్తున్నారు. తింటున్నారు. ముఖ్యంగా వీటిని చలికాలంలో పక్కాగా తింటుంటారు. ఈ కాలంలోనే ఈ నల్ల నువ్వుల లడ్డూలకు బలే గిరాకీ ఉంటుంది. ఎందుకంటే ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. శీతాకాలంలో నువ్వుల లడ్డూ తినడం వల్ల ఎముకలు బలపడతాయి. నొప్పి తగ్గిపోతుందని ప్రజలు నమ్ముతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవే కాకుండా.. నల్ల నువ్వులు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. నల్ల నువ్వుల్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బలహీనతను తగ్గిస్తాయి. అలాగే రక్త ప్రసరణను పెంచుతాయి. నల్ల నువ్వుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

26

కీళ్ల నొప్పులు

నల్ల నువ్వులు కీళ్ల నొప్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చలికాలంలో ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి చలికాలం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు నల్ల నువ్వులను తినడం లేదా నల్ల నువ్వుల నూనెతో ఎముకలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్లనొప్పుల సమస్య తగ్గిపోతుంది.
 

నువ్వుల్లో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. రాగి, కాల్షియం లు కలిసి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇంట్లో పిల్లలు ఉంటే వారికి నల్ల నువ్వులను ఖచ్చితంగా ఇవ్వండి. ఎదుగుతున్న పిల్లలకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

36

గుండెకు మంచివి

నల్ల నువ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీకు తెలుసా.. చలికాలంలో రక్తప్రసరణ చాలా తగ్గుతుంది. దీని వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. నల్ల నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటుగా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. నల్ల నువ్వులు లేదా దాని నూనెను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా పనిచేస్తాయి.
 

46

అందమైన చర్మానికి, మెరిసే జుట్టు కోసం

చలికాలంలో చర్మం తేమను కోల్పోతుంది. రంగు కూడా మారుతుంది. అంతేకాదు చర్మం పూర్తిగా డ్రై గా మారుతుంది. జుట్టు కూడా ఈ సీజన్ లో విపరీతంగా రాలిపోతుంటుంది. అయితే ఈ సమస్యలన్నీ పోగొట్టడానికి నువ్వులు మీకు బాగా ఉపయోగపడతాయి. నువ్వుల్లో థయామిన్, నియాసిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లేవిన్ లు ఉంటాయి. ఇవి చర్మానికి, జుట్టుకు రెండింటికీ మంచివి. నువ్వులను తిన్నా లేదా నూనెను ముఖానికి, జుట్టుకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. ఇలా రోజూ చేస్తే.. కేవలం నాలుగు రోజుల్లోనే తేడాను గుర్తిస్తారు. 

56

దంతాలకు 

నల్ల నువ్వులు దంతాలకు కూడా చాలా మంచిది. నల్ల నువ్వులను ప్రతిరోజూ ఉదయం నమలడం వల్ల మీ దంతాలను బలోపేతం అవుతాయి. కావిటీస్, ఇతర దంత సమస్యలు తొలగిపోతాయి. 

నల్ల నువ్వులు మంచి శక్తి వనరు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్డలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీర బలహీనతను తొలగిస్తుంది. శీతాకాలంలో సోమరితనం సాధారణం. కానీ నల్ల నువ్వులను తినడం వల్ల ఈ సీజన్ ల్ కూడా మీరు చురుగ్గా ఉంటారు. 

66

పైల్స్ సమస్య నుంచి ఉపశమనం 

శీతాకాలంలో పైల్స్ చాలా ఇబ్బంది పెడతాయి. ఈ సీజన్ లో రక్తనాళాలు కుంచించుకుపోయి రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీని వల్ల మలవిసర్జన చేయడం కష్టంగా ఉంటుంది. కొన్ని సార్లైతే మలవిసర్జనలో రక్తం బయటకు వస్తుంది. నువ్వుల వినియోగం వల్ల పైల్స్ తొలగిపోతాయి. నల్ల నువ్వులను ప్రతిరోజూ చల్లటి నీటితో కలిపి తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 

Read more Photos on
click me!

Recommended Stories