కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, హిందూ సీరియల్స్ ఫేమస్ నటుడు సిద్దాంత్ సూర్యవంశీ, హిందీ బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ద్ శుక్తా లు జిమ్ముల్లో వ్యాయామాలు చేస్తూ గుండెపోటు వచ్చి చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. వీళ్లందరి మరణాలకు హార్ట్ ఎటాక్ యే కారణమని స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్లను బట్టి హార్ట్ ఎటాక్ కు, వ్యాయామాలకు ఏదో లింక్ ఉందని స్పష్టం అవుతోంది. అందుకే వ్యాయామాలను అతిగా చేయొద్దని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. కండరాలను పెంచేయాలని ఉద్దేశ్యంతో కాకుండా.. ఆరోగ్యం కోసం.. మీకు చేతనైనా వ్యాయామాలను మాత్రమే చేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా పాణం బాలేనప్పుడు మొత్తమే వ్యాయామం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో వ్యాయామాలు చేస్తే.. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.