టీనేజ్ కి వచ్చిన పిల్లలను ప్రతి పేరెంట్స్ కచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగాలని పేరెంటింగ్ కోచ్ సందీప్ చెప్పారు.
ప్రశ్న- ఈ రోజు నీకు బాగా నచ్చిన విషయం ఏంటి?
దీనివల్ల ప్రస్తుతం వారికి ఏది ముఖ్యమో తెలుస్తుంది.
ప్రశ్న- నువ్వు ప్రపంచంలో ఒక విషయాన్ని మార్చగలిగితే, దేన్ని మారుస్తావు?
దీనివల్ల పిల్లల కలలు, ఆలోచనలు, మంచి చెడుల మీద వాళ్ల అవగాహన తెలుస్తుంది.
ప్రశ్న- నేను నిన్ను సరిగా అర్థం చేసుకున్నానా?
దీనివల్ల పిల్లలు తమ మనసులోని మాటను బయటకు చెప్పగలుగుతారు. తమ మాట పేరెంట్స్ వింటున్నారని ఫీల్ అవుతారు.
ప్రశ్న- నీకు బాధ లేదా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు?
దీనివల్ల పిల్లల భావోద్వేగాలు, వాటిని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు.
ప్రశ్న- కుటుంబంతో కలిసి నువ్వు చేయాలనుకుంటున్న కొత్త విషయం ఏంటి?
కుటుంబంతో బంధం బలపడటానికి, జ్ఞాపకాలు పెంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది.
ప్రశ్న- నీకోసం ఇప్పటివరకు ఎవరైనా చేసిన మంచి పని ఏంటి?
దీనివల్ల పిల్లల్లో కృతజ్ఞత, దయ వంటి భావనలు పెరుగుతాయి.
చిన్నారుల కోసం అందమైన గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాలకు నిండుగా మెట్టెల సవ్వడి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులు ఉంచకూడదు
రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?