చక్కెర తింటే డయాబెటీస్ వస్తుందా? దీనిపై ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవే..!

First Published Nov 13, 2022, 10:54 AM IST

షుగర్ వ్యాధి గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు మధుమేహం ఎందుకు వస్తుంది.. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. 
 

diabetes

పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా నేడు ప్రతి ఒక్కరూ డయాబెటీస్ తో బాధపడతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి సుమారు 500 మిలియన్ల మంది ప్రజలు దీని బారిన పడుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ రోగం వీళ్ల జీవితాలను పూర్తిగా తలకిందులుగా చేసేస్తుంది. దీనివల్ల మునపటిలా తినలేరు. అలా సమయాన్ని గడపలేరు.  దీని బారిన పడ్డారంటే పూర్తిగా అలవాట్లను మార్చుకోవాల్సిందే. అందుకే దీన్ని ప్రమాదకరమైన వ్యాధి అంటారు డాక్టర్లు. ఏదేమైనా ఈ వ్యాధి గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. అందుకే దీనిగురించి ఎన్నో అపోహలు పెట్టుకుంటారు. అపోహలేంటి.. నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

diabetes

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధమేహానికి కారణం రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయిలు పెరగడం. ఇది కణాలను, కణజాలాలను ప్రభావితం చేస్తుంది. అయితే డయాబెటీస్ వస్తుందన్న భయంతో ముందుగానే గ్లూకోజ్ ఉండే ఆహారాలను తినడాన్ని మానుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే గ్లూకోజ్ మన  శరీరానికి చాలా అవసరం. ఇది మనకు బలాన్ని ఇస్తుంది. కండరాలను చురుగ్గా చేయడానికి  సహాయపడుతుంది. 

మధుమేహం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్, ప్రీడయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ లు కూడా ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు డయాబెటీస్ ను ప్రభావితం చేస్తాయి. 
 

మధుమేహం ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి: తరచుగా మూత్రవిసర్జన చేయడం. అస్వస్థతకు గురికావడం, తరచుగా దాహం వేయడం, దృష్టి సమస్యలు, గాయాలు తొందరగా మానకపోవడం, రోగనిరోధక  శక్తి తగ్గడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం. అసలు డయాబెటీస్ గురించి అపోహలు, వాస్తవాలేంటో తెలుసుకుందాం పదండి. 

చక్కెర తింటే డయాబెటీస్ వస్తుందా? 

చాలా మంది  ఈ విషయాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. చక్కెరను ఎక్కువ తింటే డయాబెటీస్ పక్కాగా వస్తుందని. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పూర్తిగా అవాస్తవం. దీనిలో ఇంత కూడా నిజం లేదు. రక్తంలో షుగర్ లెవెల్స్ మధుమేహానికి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఇదే మధుహానికి ఖచ్చితమైన కారణం కాదు. 
 

అవయవాలకు  హాని కలుగుతుందా? 

మధుమేహం వల్ల పూర్తిగా అంధత్వం లేదా అవయవాలకు హాని కలుగుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీరు చాలా ఏండ్ల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంటేనే అవయవాలు దెబ్బతినడం లేదా పూర్తిగా కోల్పోతారు. ఇది ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు భయపడటం ఆపేయాలి. 

డయాబెటీస్ ఉండే పండ్లు తినకూడదు? 

చాలా మంది దీనిని గుడ్డిగా నమ్మేస్తుంటారు. డయాబెటీస్ ఉంటే పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాలని. కానీ ఇలా ఏ డాక్టర్ చెప్పరు. పండ్లలో సహజ చక్కెర ఉంటుంది. దీనిని తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే తీపి మరీ ఎక్కువగా ఉండే పండ్లను తక్కువ మొత్తంలో తినాలని సలహానిస్తారంతే. అయితే డయాబెటీస్ వచ్చిన తర్వాతే ఈ రూల్ ఫాలో కావాలి. రాకముందే మానేయడం మీ ఆరోగ్యానికే మంచిది కాదు. 

డయాబెటీస్ ఉంటే స్వీట్లు తినకూడదు..

డయాబెటీస్ పేషెంట్లు పూర్తిగా స్వీట్లకు దూరంగా ఉండాలన్న నిబంధన లేదు. బరువును అదుపులో ఉంచుకోవడానికే స్వీట్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. కానీ తియ్యని స్వీట్లను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర  స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.  అందుకే వీటికి కాస్త దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.  

click me!