కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
ఒబేసిటీకి ప్రధాన కారణం కొలెస్ట్రాల్. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించే ఎన్నో ఔషద గుణాలు వాములో ఉంటాయి. వాము చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఇట్టే తగ్గిస్తుంది. దీంతో మీరు ఊబకాయం నుంచి తొందరగా బయటపడతారు. అజ్వైన్ నీళ్లు ఒక్క బరువును తగ్గించడమే కాదు.. స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఇతర వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.