5 కంటే తక్కువ గంటలు నిద్రపోతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..

Published : Oct 19, 2022, 04:59 PM ISTUpdated : Oct 19, 2022, 05:00 PM IST

ప్రతిరోజూ ఐదు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారు చాలా మందే ఉన్నారు. కానీ దీని వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.   

PREV
15
5 కంటే తక్కువ గంటలు నిద్రపోతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు రావడం ఖాయం..

రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి, పని చేయడానికి నిద్ర చాలా అవసరం. నిద్రతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అయితే కొంతమంది రాత్రిళ్లు ఫోన్లలో లీనమై తెల్లవారు జామున ఎప్పుడో మూడు, నాలుగు గంటలకు పడుకుంటుంటారు. కానీ 5 గంటలు లేదా అంతకంటే తక్కువ టైం నిద్రపోయే వారికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కొత్త వ్యాధులు కూడా వస్తాయని తాజా అమెరికన్ పరిశోధనలో వెల్లడైంది. అసలు ఎన్ని గంటలు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసుకుందాం పదండి..  

25

PLOS మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన.. వైట్‌హాల్ II కోహోర్ట్ అధ్యయనంలో..  50, 60, 70 సంవత్సరాల వయస్సున్న  7,000 కంటే ఎక్కువ మంది పురుషులను, మహిళలు పాల్గొన్నారు. వీరి నిద్ర గంటలను బట్టి వీరి ఆరోగ్యం ఎలా ఉంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చాయో? లాంటి విషయాలను తెలుసుకున్నారు. దీనిలో 25 సంవత్సరాల కాలంలో.. రెగ్యులర్ గా ఎంత సేపు నిద్రపోయారు. వీరిలో మరణాల శాతం ఎంత, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయా? వంటి అంశాలను పరిశీలించారు.

35

ఈ పరిశోధన సమయంలో.. ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం 20% ఎక్కువగా ఉందని తేలింది. వీళ్లకు ఏడు గంటలు నిద్రపోయే వారి కంటే 25 సంవత్సరాలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం 40% ఎక్కువ ఉంది. దీనికి తోడు 50, 60, 70 సంవత్సరాల వయస్సులో ఐదు గంటలు లేదా అంతకంటే తక్కువ నిద్ర పోయే వారు.. ఏడు గంటలు పడుకునే వారితో పోలిస్తే 30 నుంచి 40 శాతం ఎక్కువ ప్రమాదం ఉందని పరిశోధన వెల్లడించింది.  
 

45
sleeping

వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం తగ్గుతుంది. కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదేమైనా.. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువ లేదా తక్కువ నిద్ర వ్యవధి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. 

55

రాత్రిళ్లు హాయిగా నిద్రపట్టాలంటే.. గదిలో ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోండి. ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండేలా చూసుకోండి. 

- నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండండి. 

- పగటిపూట శారీరక శ్రమ ఎక్కువగా చేయండి. దీనివల్ల రాత్రిళ్లు హాయిగా పడుకుంటారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories