పల్లీలు తినడం వల్ల ఈ లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.. వీటిని ఎలా తినాలంటే..?

First Published Sep 26, 2022, 4:54 PM IST

పల్లీలు రుచిగా ఉండటమే కాదు.. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయి. అలా అని వీటిని మితిమీరి తింటే కొన్ని సమస్యలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. 
 

పల్లీలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని ఆరోగ్యకరమైన చిరుతిళ్లుగా భావిస్తారు. నిజానికి ఈ వేరుశెనగల్లో పిండి పదార్థం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కొవ్వు ఆమ్లాలు, పైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. వేరు శెనగలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పదండి. 
 

గుండె  ఆరోగ్యానికి మంచివి

వేరుశెనగలను మోతాదులో తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. వేరుశెనగల్లో మన శరీరంలో రక్తపోటును స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉంటుందని వెల్లడైంది. వీటిలో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్ గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు ఈ గింజల్లో అమైనో ఆమ్లాలు, రెస్వరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ధుమనుల లోపలి పొరను రక్షిస్తాయి. 
 

peanuts

డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

డయాబెటీస్ పేషెంట్లకు వేరుశెనగలు మంచి మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ గింజల్లో ఉండే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అనారోగ్యకరమైన కొవ్వులు ఉండవు. దీనిలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర శరీర కణాల్లోకి వెల్లకుండా సహాయపడుతుంది. దీంతో ఇది శక్తిగా మారుతుంది. 
 

మంట నుంచి ఉపశమనం

వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఫ్రీరాడికల్స్ నుంచి పోరాడటానికి మీకు సహాయపడతాయి. మంటను తగ్గిస్తాయి.
 

కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది

వేరు శెనగలను తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు కూడా తప్పుతుంది. అలాగే తగ్గించవచ్చని అధ్యనాలు చెబుతున్నాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్ ఇ,  రెస్వరాట్రాల్ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటుగా పాలీఫెనోలిక్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 

బరువు తగ్గేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది

వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ రెండూ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ముందుగా ఇవి శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవి అనారోగ్యకరమైన కేలరీలు పెరగకుండా ఉంచుతాయి.
 


వేరుశెనగలను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ఆరోగ్యంగా ఉండేందుకు పల్లీలను తినడం మంచిదే కానీ.. వీటిని అతిగా తినడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిలో ఇనుము, మాంగనీస్, జింక్, కాల్షియం వంటి ఇతర ఖనిజాలు శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇవి బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తాయి. అలాగే జీర్ణసమస్యలకు దారితీస్తాయి. ముఖ్యంగా అలెర్జీ సమస్య ఉన్నవాళ్లు వీటిని మొత్తమే తినకపోవడం మంచిది. ఒకవేళ తింటే గొంతు నొప్పి, చర్మ సమస్యలు, ముక్కు కారడం, జీర్ణ సమస్యలు, శ్వాస అడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మొత్తంగా పల్లీలను మోతాదుకు మించి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. 
 

రోజుకు ఎన్ని శెనగలు తినాలి? 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 42 గ్రాములు అంటే రోజుకు 16 వేరుశెనగ గింజలను మాత్రమే తినాలని చెబుతున్నారు. కొంతమంది రోజుకు గుప్పెడు శెనగలు తినొచ్చని చెబుతుంటారు.   

click me!