నిద్రలో పీడకలలు వస్తున్నాయా? అయితే మీకు ఈ సమస్య స్టార్ట్ అయినట్టే..

Published : Sep 26, 2022, 03:01 PM IST

మీరు ఇది గమనించారో లేదో.. మధ్య వయస్కుల్లోనే పీడకలలు ఎక్కువగా వస్తాయి. దీని వెనుక అసలు నిజాన్ని బయటపెట్టారు శాస్త్రవేత్తలు. అదేంటంటే.. 

PREV
16
నిద్రలో పీడకలలు వస్తున్నాయా? అయితే మీకు ఈ సమస్య స్టార్ట్ అయినట్టే..

పీడకలలు రాత్రిళ్లు నిద్రలేకుండా చేయడమే కాదు.. మనస్సును కుదురుగా ఉండనీయవు. అసలు ఇలా  ఎందుకు కల పడింది. దీనిఅర్థం ఏంటని..  ఆలోచించేలా చేస్తాయి. నిజానికి ఈ పీడకలలకు మీ ఆరోగ్యానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని పరిశోధకులు గుర్తించారు. 

26

తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. మధ్యవయస్కుల్లో రోజూ పీడకలలు వస్తే వారు పెద్దవారయ్యాక చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం ఉందని వెల్లడైంది. పీడకలలు వచ్చే వారిలో మతిమరుపు సమస్య వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంటే వీరిలో మెదడు కణాలు దెబ్బతిన్నాయన్న సంకేతం అన్న మాట.

36

చిత్తవైకల్యం అంటే ఏంటి?

చిత్తవైకల్యం  అంటే విషయాలను మర్చిపోవడం. విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గడమని అర్థం. సాధారణంగా ఈ సమస్య 90 ఏండ్ల వయసు వారిలోనే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ సమస్య చిన్న వయసువారిలోనే కనిపిస్తుంది. ఈ చిత్తవైకల్యం వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. రోజు వారి జీవితం ఛేంజ్ అవుతుంది. స్వతంత్ర్యంగా పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది రోజు రోజుకు మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
 

46


పరిశోధన ఏం చేబుతోంది

బర్మింగ్ హమ్ విశ్వవిద్యాలయానికి చెందిన  పరిశోధకులు మూడు అధ్యయనాలను విశ్లేషించారు. దీనిలో మధ్యవయస్కులు (35 నుంచి 64 ఏండ్లు) 600 మందితో పాటుగా 2,600 పెద్దవయసు (79 ఏండ్ల నుంచి అంతకంటే ఎక్కువ) వారు వయోజనులు పాల్గొన్నారు. వీరిలో నిద్ర నాణ్యత, మెదడు ఆరోగ్యం గురించి పరిశోధన జరిపారు. 

56

కనీసం వారానికి ఒకసారి చెడు కలలు కంటున్న మధ్య వయస్కులు రాబోయే దశాబ్దంలో అభిజ్ఞా క్షీణతను అనుభవించే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. చెడు కలల వల్ల నిద్రకూడా సరిగా ఉండదు. ఇది కాస్త చిత్తవైకల్యంతో సంబంధం ఉన్న ప్రోటీన్ల నిర్మాణికి దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

66

ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. సాయంత్రం అయితే కెఫిన్ ఉండే కాఫీ, టీలను, ఇతర పానీయాలను తాగకపోవడం బెటర్. ఒత్తిడి నుంచి బయటపడటానికి మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిటీ మెండర్స్ తో మాట్లాడండి. టీవీ, మొబైల్ ఫోన్ స్క్రీన్ ను చూసే సమయాన్ని తగ్గించండి. రాత్రి భోజనంలో గ్యాస్ ను కలిగించే ఆహారాలను తినడం మానుకోండి. నిద్రపోయే రెండు గంటల ముందు నుంచి పనిచేయడం, చదవడం మానేయండి. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా రుగ్మతలతో  మీరు నిద్రతో బాధపడుతున్నట్లయితే.. వైద్యుడిని సంప్రదించండి. 

Read more Photos on
click me!

Recommended Stories