హైబీపీ నుంచి క్యాన్సర్ వరకు బ్లూబెర్రీలు ఎన్ని రోగాలను తగ్గిస్తాయో..? మరువకుండా తినండి మరి..

First Published Sep 26, 2022, 3:54 PM IST

రోజూ ఒక కప్పు బ్లూబెర్రీలను తింటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో హైబీపీ, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తాయి. 
 

పండ్ల ద్వారా మన ఆరోగ్యానికి ఎన్నో విటమిన్లు అందుతాయి. అందుకే పండ్లను రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయతే రోజూ ఒక కప్పు బ్లూబెర్రీలను తింటే ఎన్నో రోగాల ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. బెర్రీలల్లో విటమిన్ ఎ, కార్భోహైడ్రేట్లు, వాటర్ కంటెంట్, గ్లూకోజ్, ప్రోటీన్, కొవ్వులు, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, లుటిన్, విటమిన్ ఇ, విటమిన్ కె, కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. 

బ్లూబెర్రీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతుంది. అలాగే బ్రెయిన్ పనితీరును కూడా  మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఈ పండు సహాయపడతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 
 

ప్రతిరోజూ ఒక కప్పు బ్లూబెర్రీలను తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పలు అధ్యయనాల ప్రకారం.. విటమిన్ కె అధికంగా ఉండే బ్లూబెర్రీస్ లేదా ఇతర బెర్రీలను రోజూ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. 

బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యల నుంచి క్యాన్సర్ నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. బ్లూబెర్రీల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్.. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి కూడా. 

బ్లూబెర్రీలను రోజూ తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. పనితీరుకు కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  బ్లూబెర్రీల్లో ఉండే సమ్మేళనాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే పార్కిన్సన్ వంటి మెదడు వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదాన్ని 40 శాతం తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లూబెర్రీస్ పిల్లలలో జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
 

 బ్లూబెర్రీలు డయాబెటీస్ లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అంలే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. స్థూలకాయంతో బాధపడేవారు కూడా ఈ పండ్లను తినొచ్చు. ఈ పండ్లను రోజూ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తొందరగా కరిగిపోతుంది.అలాగే  ఈ పండ్లు చర్మంపై ఉండే ఫ్రీ రాడికల్స్ ను, ముడతలను, మచ్చలను, డ్రై స్కిన్ వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా పోగొడుతాయి. తగ్గిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కాంతివంతంగా చేస్తుంది. 

బ్లూబెర్రీలు ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. దీనిలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ కె, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే బోన్ లాస్ అయ్యే ప్రమాదం తప్పుతుంది. బ్లూబెర్రీలను తినడం వల్ల టైప్ 1 డయాబెటీస్ ముప్పు కూడా తప్పుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అంతేకాదు ఈ పండ్లు అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. 
 

click me!