చలికాలంలో జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ను తప్పకుండా పాటించండి..

First Published Dec 24, 2022, 1:01 PM IST

చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. హెయిర్ ఫాల్, చుండ్రు, డ్రై హెయిర్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 
 

చలికాలంలో వీచే పొడి గాలులు తల నుంచి తేమను తగ్గిస్తుంది. దీనివల్ల మీ జుట్టు సమస్యలు వస్తాయి. అలాగే నెత్తిమీద దురద పెడుతుంది. అలాగే చుండ్రు సమస్య వస్తుంది. నెత్తి డ్రైగా మారుతుంది. దీనివల్ల నెత్తిమీద దురద పెడుతుంది. అలాగే చెడు వాసన వస్తుంది. 

చుండ్రు పెరగడం వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అయితే చలికాలం వల్ల కలిగే ఈ నష్టాలను పూర్తిగా నివారించలేకపోవచ్చు. కానీ కొన్ని సమర్థవంతమైన చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జుట్టుకు నూనెను పెట్టండి

గాలిలో తగినంత తేమ లేకపోవడం వల్ల నెత్తి పొడిగా ఉంటుంది. దురద కూడా పెడుతుంది. చుండ్రు, ఫ్లాకినెస్ వల్ల నెత్తిమీద చిరాకు కలుగుతుంది. ఇది జుట్టు రాలడానికి దారితీస్తుంది. కొబ్బరి, ఆలివ్ నూనెలు జుట్టుకు పోషణను అందిస్తాయి. ఈ వెచ్చని నూనెలతో నెత్తిమీద బాగా మసాజ్ చేయండి. ఈ నూనెలు హెయిర్ షాఫ్ట్ లోకి ప్రవేశిస్తాయి. జుట్టులో తేమను ఉంచుతాయి. మసాజ్ ద్వారా నెత్తిమీద రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు  పోషణను అందిస్తుంది. అలాగే  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 

హీట్ స్టైలింగ్ నివారించండి

మీ సహజ జుట్టును ఉంచుకోవడానికి ప్రయత్నించండి. హీట్ స్టైలింగ్ వల్ల మీ జుట్టు డీహైడ్రేట్ అవుతుంది. స్ట్రాండ్లపై రసాయనాలు మీ జుట్టును దెబ్బతీస్తాయి. దీనివల్ల వెంట్రుకలు తెగిపోతాయి. చీలిపోతాయి. కనీసం చలికాలంలోనైనా మీ జుట్టును వేడి చేయడం మానుకోండి. దీనివల్ల జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. 
 

వేడి నీటి హెయిర్ వాష్ లకు దూరంగా ఉండండి

చలికాలంలో వేడి నీటి స్నానం చేయడం అంత మంచిది కాదు. నిజానికి వేడినీటితో స్నానం చేయడం వల్ల మనస్సుపై, శరీరంపై ప్రశాంతమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ వేడి నీటి స్నానం వల్ల జుట్టు బాగా దెబ్బతింటుంది. మీ జుట్టును  వేడి నీటిలో కడగడం వల్ల కుదుళ్లు బలహీనంగా మారుతాయి. అలాగే జుట్టులోని తేమ అంతా పోతుంది. అందుకే మీ జుట్టును కడిగేటప్పుడు నీరు మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. 
 

hair care

తేమ

మీ జుట్టును డీప్ కండిషన్ చేయడానికి ప్రతి వారం కొంత సమయం కేటాయించండి. హెయిర్ మాస్క్ ను ధరించండి. చుండ్రును అదుపులో ఉంచడానికి, నెత్తిని ఆరోగ్యంగా ఉంచడానికి యాంటీ డాండ్రఫ్ క్రీమ్ ను వాడండి. జుట్టు బలంగా మారుతుంది. జుట్టు తంతువులు బలంగా మారుతాయి. అలాగే  నెత్తిమీద తేమ పెరుగుతుంది. జుట్టుకు ఆవిరి పట్టిన తర్వాత హెయిర్ ఫోలికల్స్ మృదువుగా, ప్రకాశవంతంగా మారతాయి. కనీసం నెలకు ఒక్కసారైనా హెయిర్ సెలూన్ కు వెళ్లండి. కండీషనర్, షాంపూలతో చలికాలంలో జుట్టు ఊడిపోవడాన్ని నివారించొచ్చు. 
 

జుట్టును కప్పి ఉంచండి

శీతాకాలంలో పొడి గాలి, గాలి, కాలుష్యం, వర్షం నుంచి మీ జుట్టును రక్షించడం చాలా ముఖ్యం. వీటివల్ల జుట్టు బాగా పొడిబారుతుంది. అలాగే తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు  టోపీ లేదా స్కార్ఫ్ తో జుట్టును కప్పి ఉంచండి. డ్రై ఆయిల్ ను ఉపయోగించకపోవడమే మంచిది. జుట్టుకు మేలు చేసే నూనెలను మాత్రమే ఉపయోగించండి. 
 

ఎక్కువగా కడగడం మానుకోండి

జుట్టును అతిగా వాష్ చేయడం వల్ల జుట్టుకు పోషణ అందదు. అలాగే జుట్టును సంరక్షించే సహజ నూనెలు కోల్పోతాయి. ముఖ్యంగా చలికాలంలో జుట్టును ఎక్కువగా వాష్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే నెత్తిపై ఉండే సహజ నూనెలు చాలా అవసరం. ప్రతిరోజూ జుట్టును క్లీన్ చేయకపోవడమే మంచిది. దీనివల్ల జుట్టు పొడిబారుతుంది. అందుకే ప్రతి మూడు రోజులకు ఒకసారి జుట్టును వాష్ చేయండి. 
    

click me!