నిత్యం వ్యాయామం చేస్తున్నారా.... అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

First Published Dec 24, 2022, 12:16 PM IST

వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అయినప్పటికీ వ్యాయామానికి ముందు తర్వాత తీసుకునే ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాయామానికి ముందు తర్వాత ఏం చేయాలి అనే విషయానికి వస్తే.....
 

సాధారణంగా మన శరీరంలో అన్ని ప్రక్రియలు సక్రమంగా జరగాలన్న మనం ఏ విధమైనటువంటి సమస్యలతో లేకుండా మన శరీరం చాలా ఫిట్ గా ఉండాలన్న ప్రతిరోజు వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమైన అంశం.అయితే చాలామంది వ్యాయామం అంటేనే పెద్ద ఎత్తున శరీర నొప్పులు ఉంటాయని భావిస్తూ ఉంటారు. అయితే నిత్యం వ్యాయామం చేయటం వల్ల ఈ నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
 

ఇకపోతే వ్యాయామం చేసేవారు సరైన నియమ నిబంధనలను పాటించకుండా వ్యాయామం చేయటం వల్ల కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదం కావచ్చు అందుకే తప్పనిసరిగా వ్యాయామం చేసే ముందు చేసిన తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా అవసరం. మరి వ్యాయామానికి ముందు తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే...
 

సమర్థవంతమైన వ్యాయామం చేయాలంటే తగిన శక్తి అవసరం కనుక మనకు శక్తిని అందించేటటువంటి ఆహార పదార్థాలను వ్యాయామానికి ముందు తీసుకోవడం అవసరం. అందుకే వ్యాయామానికి ముందు శక్తి అందించే పిండి పదార్థాలు, యాపిల్‌, మొక్కజొన్న, బ్రౌన్‌ బ్రెడ్‌ విత్‌ పీనట్‌ బటర్‌ లాంటివి తీసుకోవాలి.
 

ఇక వ్యాయామం చేస్తున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గుడ్డు తెల్ల సోన లేదా అరటిపండును తినడం వల్ల మనకు ఎలాంటి ఒత్తిడి అనిపించదు. ఇలా వ్యాయామం చేసిన అనంతరం తప్పనిసరిగా మన ఆహార పదార్థాలలో మాంసకృతులు ఉండేలా చూసుకోవాలి. దీనికోసం గుడ్డు తెల్ల సోనా లేదా ఆవిరి మీద ఉడికించినటువంటి చికెన్ లేదా చేపలను తీసుకోవడం ముఖ్యం.
 

ఇదే కాకుండా ఎవరికైతే ప్రోటీన్ షేక్ తీసుకోవడం అలవాటు ఉంటుందో అలాంటి వారు వ్యాయామం తర్వాత ప్రోటీన్స్ షేక్ తీసుకోవడం కూడా ఎంతో మంచిది. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను వ్యాయామానికి ముందు తర్వాత తీసుకోవడం వల్ల మన శరీరం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటుందని చెప్పాలి.

click me!