Hair growth tips: మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే చిట్కాలివిగో..

First Published Jan 28, 2022, 2:55 PM IST

Hair growth tips:ప్రస్తుత కాలంలో ఒత్తైన, పొడవైన జుట్టు ఉండటం గగణమైపోయింది. అంతెందుకు ఉన్న జుట్టునే కాపాడుకోవడమే అతి కష్టతరమైన పనిగా మారింది. ఎందుకంటే.. మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఫుడ్ ఇవన్నీ మన జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తద్వారా హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది. 
 

Hair growth tips: ఆడవారు మగవారంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఒత్తైన, నల్లటి కురులు ఉండాలని కోరిక ఉంటుంది. అందులో అమ్మాయిలకు పొడవైన జుట్టు అంటే మహా ప్రాణం. అందుకే వెంట్రుకలు పెరిగే రకరకాల నూనెలను, షాంపులను వాడుతూ ఉన్న వెంట్రుకలు ఊడిపోయేలా చేస్తున్నారు. అయినా ప్రస్తుత కాలంలో పొడవైన, నిగారింపైన జుట్టు ఉండటం అంటే మాటలు కావు. పొడవైన జుట్టు సంగతి పక్కన పెడితే చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఆహారం , హార్మోన్ల అసమానతలు వంటివే చాలానే ఉన్నాయి. అయితే ఈ హెయిర్ ఫాల్ (hair fall) సమస్య నుంచి బయటపడటానికి, జుట్టు చాలా ఫాస్ట్ గా పెరగడానికి కొన్ని రకాల సహజ పద్దతులు బాగా ఉపయోగపడతాయి. వాటికి పైసా ఖర్చు చేయక్కర్లేదు. జుట్టు తొందరగా పెరిగేందుకు సహాయపడే పద్దతులేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుకుందాం.
 

బాదం: బాదం పప్పులో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అలాగే ఈ బాదంలో విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది కెరాటిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. తద్వారా దెబ్బతిన్న జుట్టును బాగు చేయబడుతుంది. అందుకే ప్రతిరోజూ బాదం పప్పులను తీసుకుంటూ ఉండాలి.
 

అరటి పండు:  అరటి పండులో ఫోలిక్ యాసిడ్, కాల్షియం లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి కేశ సంరక్షణకు ఎంతగానో సహాయపడతాయి. అందుకే మీ రోజు వారి ఆహారంలో అరటి పండు ఉండేలా చూసుకోవాలి. కొన్ని పాలను తీసుకుని అందులో తేనె, బాదం పప్పులు, సీడ్స్, నట్స్ , దాల్చిన చెక్క పౌడర్ వేసి అలాగే అరటి పండును వేసి బాగా మిక్స్ చేసి తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది. 

కలబంద:  కలబందలో ఎంజైమ్ లు, ప్రోటీయోలైటిక్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వెంట్రుకల కుదుళ్లను బలంగా మారుస్తుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలను బాగు చేస్తుంది. తద్వార మీ వెంట్రులు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. వెంట్రుకలు బలంగా కావాలన్నా, వేగంగా పెరగాలన్నా ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు అలొవేరా జ్యూస్ ను తాగాలి. అయితే ఈ చిట్కా పాటించే ముందు ఒక సారి వైద్యుల సలహాలను తెలుసుకోండి.

ప్రోటీన్స్: జుట్టు ఒత్తుగా ఉండాలన్నా.. ఊడిపోకుండా ఉండాలన్నా, పెరగాలన్నా ప్రోటీన్ ఆహారం ఎంతో అవసరం. 95 శాతం ప్రోటీన్లతోనే వెంట్రుకలు రూపొందించడతాయి. కాబట్టి మీ రోజూ వారి ఆహారంలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉండేలాగ చూసుకోవాలి. అప్పుడే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగు, పాలు, బాయిల్డ్ ఎగ్స్, చికెన్, గింజల్లో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. 

మెంతులు: మెంతుల్లో విటమిన్ ఎ, కె, సి, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఈ గింజలు కాల్షియం, పొటాషియం, ఐరన్, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి. ఇవన్నీ జుట్టును సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు జుట్టును వేగంగా పెరిగేలా చేస్తాయి. ఈ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం పూట తినొచ్చు. అలా కాకుంటే వంటలలో మసాలాగా కూడా ఆడ్ చేసుకుని తిన్నా మంచి ఫలితం ఉంటుంది.  

click me!