మీరు నమ్మినా నమ్మకున్నా.. ఒక్కోసారి మనం రాత్రి పడుకొని ఉదయం లేచే సమయం కల్లా.. బరువు పెరిగేస్తూ ఉంటాం. ఒక్క రాత్రిలో బరువు ఎలా పెరుగుతామనే సందేహం మీకు కలగొచ్చు. విపరీతమైన తేడా కనపడకపోయినా.. ఎంతో కొంత తేడా కనపడుతుంది. మరి అలా రాత్రికి రాత్రే.. మనం బరువు పెరగడానికి గల కారణాలేంటో ఓసారి చూద్దామా..
ఉదయం పూట కాకుండా.. రాత్రిపూట మజిల్ గెయిన్ అయ్యే.. వర్కౌట్స్ చేస్తే.. బరువు పెరిగే అవకాశం ఉంటుందట. బరువులు ఎత్తడం లాంటి వర్కౌట్స్ చేయడం వల్ల.. మజిల్ పెరుగుతుందట. దాని వల్ల.. కొంత బరువు పెరిగే అవకాశం ఉంటుందట.