Children's behaviour: పిల్లల ముందు పేరెంట్స్ ఎలా మాట్లాడకూడదో తెలుసా?

First Published | Jan 28, 2022, 1:57 PM IST

Children's behaviour: ఈ పిల్లలేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు. బొత్తిగా భయం లేకుండా పోయింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడు అంటూ పిల్లలపై చాలా మంది పేరెంట్స్ అరుస్తుంటారు. అయితే పిల్లలు ఎలా ప్రవర్తించినా దానికి మీరే అసలు కారణమన్న విషయం మీకు తెలుసా.. అవును మీరు చదివింది నిజమే వారి ముందు మనం ఎలా ప్రవర్తిస్తే వారు కూడా అలాగే బిహేవ్ చేస్తారు.

Children's behaviour: పిల్లలకు ఎటువంటి విషయన్నైనా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అందులోనూ వారు చూసిన విషయాలను, ఎదుటి వారు అన్న మాటలను అంత తొందరగా మర్చిపోరు. అంతేకాదు కొన్ని కొన్ని విషయాలు వారిపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తాయి. అందులో వారి తల్లిదండ్రుల మాటలు వారిని మరింత ప్రభావితం చేస్తాయి. వారి ముందు పేరెంట్స్ ఏ విధంగా నడుచుకుంటున్నారు.. ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు.. ఇటువంటి మాటలు పిల్లల ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. పిల్లల భవిష్యత్ ను చక్కదిద్దే భాద్యత ఎక్కువగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటప్పుడు పిల్లల ముందు పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. 

పిల్లల ఎటువంటి కష్టతమైన విషయాన్నైనా ఈజీగా అర్థంచేసుకుంటారు. అందులోనూ వీరు ఎక్కువగా సమయాన్ని గడిపేది తల్లిదండ్రులతోనే. అందులోనూ వారి ఎదుగుదల మొత్తం ఇంట్లోనే జరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులవుతాయి. కాబ్టటి పిల్లలు మీతో ఉన్నప్పుడు వారి ముందు జాగ్రత్తగా మసులుకోవాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని చూసే చాలా విషయాలను నేర్చుకుంటారు కాబట్టి. అందుకే వారితో ఆచీ. తూచీ మాట్లాడటం నేర్చుకోవాలి. 
 


పిల్లలతో మాట్లాడేప్పుడు చాలా తెలివిగా స్పందించాలి. వారి ముందు ఎలాంటి మాటలు మాట్లాడాలో.. ఎలాంటి పదాలను మాట్లాడకూడదో తెలుసుకోవాలి. లేదంటే పిల్లలు మీ మాటలు విని వారు కూడా అనే అవకాశం ఉంది. 
 

పిల్లల సామర్థ్యం విషయంలో గానీ.. మరే విషయంలోనైనా వేరే వారితో పోల్చడం మంచి పద్దతి కాదు. ఇలాంటి విషయాలు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా వారు భావిస్తారు. ఇది క్రమేపీ అసూయకు దారి తీస్తుంది. అంతేకాదు వారిపై ద్వేశం, అయిష్టత వంటవి ఏర్పడతాయి. అందుకే వారిని వారుగా ఉండనివ్వండి. ఎలా ఉండాలో నేర్పించడం. అంతేకానీ పోల్చడం మాత్రం వారికి మీకు అంత మంచిది కాదు. 

నీకిది చేతకాదు.. దీన్ని నువ్వు సాధించలేవు లాంటి మాటలు పిల్లల ముందు ఎప్పుడూ అనకండి. ఎందుకంటే ఇలాంటి మాటల ద్వారానే పిల్లలు వారి ప్రతిభను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఇలాంటి మాటలు వారికి నేర్చుకునే (Learning capacity) తత్వాన్ని దూరం చేస్తాయి.


పిల్లల ముందు లింగ బేధం చూపకండి. నువ్వు గర్ల్ వి ఇలాంటి ఆటలు ఆడకూడదు. ఇటువంటి పనులు చేయకూడదు అనే మాటలు అస్సలు మాట్లాడకండి. ఎందుకంటే శక్తి సామర్థ్యాలు ఆడ మగ అంటూ రావు కదా.. ప్రస్తుత ప్రపంచంలో ఆడమగ అంటూ తేడా లేకుండా ఎవరికి వారు తమ ప్రతిభను లోకానికి చాటి చెబుతున్నారు. ఏ మనిషిలో ఎంత సామర్థ్యం ఉందో వారి జెండర్ ను బట్టి డిసైడ్ చేయలేము కదా. 
 

పిల్లు ఏది అడిగినా కదనకుండా చేయడానికి ప్రయత్నించండి. వారు అడిగిన వెంటనే చేయాలనేం లేదు. కానీ మీకు వీలున్నప్పుడన్నా వారి కోరిన వాటిని తీర్చడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. లేకపోతే వారి అడిగారని కుదరదు, సాధ్యం కాదు, వద్దే వద్దు అంటూ సమాధానం చెప్పుకుంటూ పోతే వారికి మీపై విశ్వాసం సన్నగిల్లుతుంది. అలాగే మీరంటే ప్రేమ ఉండాల్సిన ప్లేస్ లో భయం వచ్చి చేరుతుంది. 

పిల్లలు కొంటె పనులు చేస్తున్నారని వారిని తిట్టడం కానీ.. మీతో మాట్లాడటం మానేస్తాను అనే మాటలను అనొద్దు. ఎందుకంటే ఇలాంటి మాటలు వారిని డిప్రెషన్ లోకి తీసుకెళ్తాయి. స్వేచ్ఛగా మాట్లాడలేరు. అంతేకాదు ఫ్యూచర్ లో వారు మీతో మాట్లాడటానికి కూడా భయపడే అవకాశాలు ఉన్నాయి. మీకు మేమున్నాం అనే ధైర్యం మీరు కావాలి.. కానీ వారి బాల్యం పాలిట శాపంగా మీరు మారకూడదు. 
 

Latest Videos

click me!