సహజ వస్తువులను ఉపయోగించండి
జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రొడక్స్ మార్కెట్ లో చాలానే ఉంటాయి. కానీ వాటిలో కెమికల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కెమికల్స్ ప్రొడక్ట్స్ మీ జుట్టు ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. హెయిర్ ఫాల్ సమస్యకు దారితీస్తాయి. అందుకే వాటికి బదులుగా వంటింట్లో ఉండే నేచురల్ వస్తువులతోనే మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలోవెరా జెల్, నిమ్మ, తేనె, అరటిపండు, గుడ్డు, పుదీనా, పెరుగు మొదలైన వాటిలో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందించడానికి సహాయపడతాయి. దీన్ని హెయిర్ ప్యాక్ లా తయారుచేసుకుని జుట్టుకు అప్లై చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.