ఈ అలవాట్లు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయి.. వదులుకుంటే బెటర్..

Published : Oct 18, 2022, 12:01 PM IST

కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్ని విధాలా హెల్తీగా ఉంటాం. కానీ కొన్ని అలవాట్లతో చాలా మంది తమ కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.   

PREV
19
ఈ అలవాట్లు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయి.. వదులుకుంటే బెటర్..
kidney health

మన శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా పని చేస్తేనే శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. శరీరం శుభ్రపడుతుంది. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. కానీ మన అలవాట్లే కిడ్నీలను దెబ్బతీస్తాయి. అవేంటంటే.. 

29

మందులను ఎక్కువగా ఉపయోగించడం:  కిడ్నీల్లో నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ నొప్పి తగ్గేందుకు ట్యాబ్లెట్లను మింగుతుంటారు. డాక్టర్ ను అడగకుండా.. సొంత వైద్యం చేసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీల సమస్యలు ఉన్నవాళ్లు మందులను ఎక్కువగా వేసుకోకూడదు. 
 

39

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం: మన శరీరానికి ఉప్పు అవసరమే. అది కూడా మోతాదులో. తినాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్య వస్తాయి. అందులో రక్తపోటు ఒకటి. ఉప్పు వల్ల రక్తపోటు బాగా పెరిగిపోతుంది. దీంతో మీ మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఉప్పును ఎప్పుడూ మోతాదులోనే తీసుకోవాలి. 

49

ప్రాసెస్డ్ ఫుడ్:  ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఫాస్పరస్, సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మూడ్రపిండాలను దెబ్బతీస్తాయి. ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి. 

 

59

నీళ్లను తాగకపోవడం:  మన శరీరానికి పోషకాహారం చాలా అవసరం. పోషకాలతోనే మనం హెల్తీగా ఉంటాం.  వీటితో పాటుగా శరీరానికి నీళ్లు కూడా చాలా చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలో నీళ్లు లేకపోతే.. బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడొచ్చు. అందుకే నీళ్లను ఎక్కువగా తాగాలి. కిడ్నీ స్టోన్స్ తో బాధపడేవారు నీళ్లను ఎక్కువగా తాగితే స్టోన్స్ తొందరగా తొలగిపోతాయి. 
 

69

నిద్రలేకపోవడం:  ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. నిద్ర సరిగ్గా పోకుంటే కిడ్నీల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

79

మాంసం ఎక్కువగా తినడం: మాంసాహారం మంచిదే. దీని నుంచి మన శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్లు అందుతాయి. అలాగని ఎక్కువగా తిన్నా కష్టమే. ఎందుకంటే ఇది రక్తంలో ఆమ్లం ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాంసాహారాన్ని ఎక్కువగా తినకూడదు. 

 

89

చక్కెరను ఎక్కువగా తీసుకోవడం:  తీపి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. అలాగే డయాబెటీస్ వస్తుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. అంతేకాదు కిడ్నీలు కూడా పాడైపోతాయి. 
 

99
smoking

స్మోకింగ్:  స్మోకింగ్ చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్న ముచ్చట అందరికీ తెలుసు. పొగాకు ఒక్క ఊపిరితిత్తులనే కాదు గుండెను కూడా ప్రమాదంలో పడేస్తుంది. స్మోకింగ్ వల్ల కిడ్నీలు కూడా పాడవుతాయి. 
          

Read more Photos on
click me!

Recommended Stories