మన శరీరానికి విటమిన్లు చాలా అవసరం. ఎందుకంటే ఇవే మన శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహయపడతాయి. శారీరక విధులు సక్రమంగా జరిగేలా చేస్తాయి. అన్ని రకాల విటమిన్లలో ఒకటైన విటమిన్ బి12 మన శరీరానికి చాలా అవసరమైన పోషకం. ఒకవేళ మీ శరీరంలో ఈ విటమిన్ బి12 లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ పోషకం డిఎన్ఏ ను తయారు చేయడం, ఫోలిక్ యాసిడ్ ను శోషించుకోవడం వంటి పనులను చేస్తుంది. అందుకే మన శరీరంలో ఈ పోషకం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..