మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గితే.. గుండెల్లో మంట, వెన్ను నొప్పి, శరీర బలహీనత, తలనొప్పి, మైకము వంటి సమస్యలు వస్తాయి. దీంతో మనకు బాగా దాహం అవుతుంది. ఎందుకంటే శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు శరీరం ఇతర అవయవాల నుంచి నీటిని తీసుకోవడం ప్రారంభిస్తుంది. అందుకే దాహం వేసినా.. వేయకపోయినా నీటిని మాత్రం ఖచ్చితంగా తాగుతూ ఉండాలి.