
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆరోగ్యం బాగుంటేనే మనం ఎలాంటి పనులనైనా చేస్తాం. నిజానికి మన ఆరోగ్యం మన రోజువారీ పనులపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దంతాలను ఎలా బ్రష్ చేసుకుంటున్నాం? పడకగదిని ఎలా మెయిన్ టెయిన్ చేస్తున్నాం? వారంలో ఎన్ని సార్లు మద్యాన్ని తాగుతున్నాం? వంటి అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన రోజువారీ అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన మంచి అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఉదయం బయటకు వెళ్లండి
మీరు మీ రోజును ఎలా ప్రారంభిస్తారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రోజంతా మీరు ఎలా ఉండాలో ఇదే నిర్ణయిస్తుంది. విజయవంతమైన వ్యక్తులందరూ సూర్యోదయానికే ముందే మేల్కొంటారన్న విషయాన్ని చెప్పడం వినే ఉంటారు. ఇది మనస్సుకు మంచిది. రాత్రి హాయిగా పడుకోవడానికి రోజంతా చురుగ్గా ఉండానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు చురుకుగా ఉండటానికి, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బహిరంగ ప్రదేశంలో వ్యాయామం, నడక, రన్నింగ్ లేదా యోగా చేయండి. వీటివల్ల ప్రతికూల భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
మీ ప్లేట్ ను వివిధ కూరగాయలతో లోడ్ చేయండి
ఆరోగ్యకరమైన ఆహారాలే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మాంసంతో పోల్చితే రకరకాల కూరగాయలు, ఆకు కూరలే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎందుకంటే వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మీరు కొంత బరువు తగ్గడానికి ఒక గొప్ప మార్గం. కూరగాయలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతం చేసే అవసరమైన పోషకాలతో లోడ్ చేయబడి ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి. ఒక వారం పాటు రోజుకు కనీసం ఒక పూట భోజనంలో మీకు ఇష్టమైన కప్పు కూరగాయలను తీసుకోండి. కాకపోతే రోజంతా రకరకాల కూరగాయలను తినండి.
ఫుడ్ జర్నల్ ను చదవండి
ఆహార డైరీ లేదా జర్నల్ ను రెగ్యులర్ గా చదవండి. ఎందుకంటే ఇలాంటి వాటిని చదవడం వల్ల ఎలాంటి ఆహారం తినాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎలాంటి ఫుడ్స్ ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో తెలుస్తుంది. ఫుడ్ జర్నల్ ద్వారా మీరు వేటిని తినాలి? వేటిని తాగాలో ఒక జాబితాను రూపొందించండి. చక్కెర పానీయాలు, ఆల్కహాల్ తో సహా మీరు తినే, తాగే ప్రతిదాన్ని రాయండి. మీరు హైలైట్ చేసిన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను వీలైనంత తొందరగా తగ్గించుకోండి. ఈ అనారోగ్యకరమైన అలవాట్లను కొత్త, ఆరోగ్యకరమైన అలవాట్లతో భర్తీ చేయండి. ఇదంత సులభం కాదు.. కానీ ఫిట్ గా, ఆరోగ్యంగా కనిపించడానికి వీటిని వదులుకోకతప్పదు.
తగినంత నిద్ర పొందండి
గాఢమైన నిద్ర మీరు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా అవసరం. రోజుకు 7 నుంచి 8 గంటలు గాఢమైన నిద్ర పోతే భావోద్వేగ శ్రేయస్సు మెరుగుపడుతుంది. శరీర మరమ్మత్తు, పునరుద్ధరణ, పునరుజ్జీవనం, నిర్విషీకరణ, రీసైక్లింగ్, కండరాల పెరుగుదల, హార్మోన్ల సమతుల్యత, రక్తంలో చక్కెర స్థాయిలు వంటి కొన్ని ముఖ్యమైన ప్రక్రియలకు నిద్ర చాలా అవసరం.
ఎక్కువ నీటిని తాగాలి
ఆరోగ్యకరమైన జీవితానికి నీరు ఖచ్చితంగా అవసరం. ఇది మీ గుండె నుంచి మీ కండరాలు, మీ మెదడు, మీ జీవక్రియ వరకు ఎన్నో శరీర విధులను ప్రభావితం చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. అలాగే మీరు తాగే నీటిలో 20 శాతం నీరు ఆహారాలు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, పానీయాలు, ఉడకబెట్టిన సూప్ ల నుంచి అందుతుంది. ఇందుకోసం మీ ఆహారంలో స్ట్రాబెర్రీలు, బెల్ పెప్పర్స్, పాలకూర వంటి పండ్లు , కూరగాయలను ఎక్కువగా చేర్చండి.