Avoid These Foods: రాత్రుళ్లు వీటిని తింటే మీ బంగారు నిద్ర భంగమవడం పక్కా..

Published : Feb 10, 2022, 04:55 PM IST

Avoid These Foods: కొన్ని రకాల ఆహార పదార్థాలతో హాయిగా నిద్రొస్తే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రం మీ బంగారు నిద్రకు భంగం కలిగిస్తాయి. వీటిని రాత్రిపూట తీసుకోకపోతేనే మీరు హాయిగా నిద్రపోతారు. లేకుంటే.. రాత్రంతా మీకు జాగారం తప్పదు సుమా..  

PREV
16
Avoid These Foods: రాత్రుళ్లు వీటిని తింటే మీ బంగారు నిద్ర భంగమవడం పక్కా..

Avoid These Foods: ఆరోగ్య వంతమైన జీవితానికి పోషకవిలువలుండే ఆహారం ఎంత అవసరమో.. కంటినిండా నిద్రకూడా అంతే అవసరం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి నిద్రకరువైంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ.. రాత్రుళ్లు కంటినిండా నిద్రలేక అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వాటికి రాత్రుళ్లు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

26

చాక్లెట్లు: పిల్లలు, పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చాక్లెట్లంటే మహా ఇష్టం. అందుకే బయటకెళ్లినప్పుడల్లా చాక్లెట్లను తెచ్చుకుంటూ ఉంటారు. వీలున్నప్పుడల్లా వీటిని చప్పరిస్తూ ఉంటారు. కానీ ఈ చాక్లెట్లలో షుగర్ ఎక్కువ శాతం ఉంటుంది. అయితే కొంతమందికి భోజనం చేసిన తర్వాత స్వీట్లు తినే అలవాటు ఉంటుంది. అయితే వీళ్లు స్వీట్లకు బదులుగా చాక్లెట్లనే తినడానికి ఇష్టపడుతుంటారు. వీటివల్ల నిద్రపట్టకపోవచ్చు. ఎందుకంటే చాక్లెట్లలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి రాత్రుళ్లు వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం.

36

కాఫీ, టీ: టీ సుక్కతో గొంతు తడపనిదే చాలా మంది తమ రోజు వారి పనులను మొదలు పెట్టనివారు ఎంతో మంది ఉన్నారు. వీరు మూడు పూటలా అన్నం తినడం లాగానే టీ లేదా కాఫీని తాగుతూ  ఉంటారు. అయితే టీ లేదా కాఫీని తాగడం వల్ల నిద్రమత్తు పూర్తిగా వదిలిపోతుంది. అందుకే భోజనం చేసిన తర్వాత వీటికి దూరంగా ఉండాలి. లేదంటే తెల్లవార్లూ మీరు బెడ్ పై అటూ ఇటూ దొర్లడం తప్ప నిద్రపోయే ప్రసక్తే ఉండదు.
 

46

పిజ్జా: ఈ మధ్యకాలంలో రాత్రిపూట డిన్నర్ గా పిజ్జాలను తినడం ట్రెండింగ్ మారింది. పెద్దలే కాదు పిల్లలకు కూడా ఈ అలవాటును నేర్పిస్తున్నారు. మీకు తెలుసా.. పిజ్జాలల్లో క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఈ పిజ్జాలల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ లు మెండుగా లభిస్తాయి. అవి మనకు నిద్రలేకుండా చేస్తాయి. కాబట్టి రాత్రిపూజ పిజ్జాలను తినడం మానుకోవడం ఉత్తమం.

56
ಟೊಮ್ಯಾಟೋ ಕೆಚಪ್ ರುಚಿ ಹೆಚ್ಚಿಸುವುದರ ಜತೆಗೆ ಕೂದಲನ್ನು ಶೈನ್ ಮಾಡುತ್ತೆ!

టమాటా సాస్ : టమాటా సాస్ లంటే ఇష్టపడని పిల్లలంటూ ఉండరేమో.. కానీ వీటిని నైట్ టైం అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎగ్ పప్స్, కర్రీ పప్స్ , నూడుల్స్ లల్లో ఈ టమాటా సాస్ ను కలుపుకుని తినడం చాలా మందికి అలవాటు. కానీ ఇలా తింటే మాత్రం ఛాతిలో మంట పుడుతుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే దీనివల్ల అజీర్థి సమస్య కూడా రావొచ్చు. తద్వారా కంటికి నిద్ర ఉండదు. 

66

పుల్లని పండ్ల రసాలు: పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. అయితే రాత్రి సమయంలో పుల్లటి పండ్లకు, పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పుల్లని పండ్ల రసాలు తాగడం వల్ల పొట్ట ఇబ్బందికి గురవుతుంది. దాంతో నిద్రపై చెడు ప్రభావం పడుతుంది. అంతే కాదు పుల్లని పండ్ల రసాల వల్ల కడుపులో Acidic reaction ఏర్పడుతుంది. తద్వారా మీకు నిద్రకరువైతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories