వివాహం తరువాత తొలికలయికలో పాల్గొనడానికి చాలా మందిలో అనేక అనుమానాలు (Suspicions) ఉంటాయి ఇవి సర్వసాధారణం. ఒకవేళ లైంగిక జీవితం పట్ల అనేక సందేహాలు ఉంటే గైనకాలజిస్ట్ ను కలిసి సరైన గైడెన్స్ తీసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత మొదటిసారి తొలి కలయికలో పాల్గొన్నప్పుడు కాస్త నొప్పిగా (Pain) ఉంటుంది.
అలా కాకుండా ప్రతిసారీ కలయికలో పాల్గొన్నప్పుడు అసౌకర్యంగా (Uncomfortable), నొప్పిగా ఉంటే దానికి గల కారణం ఏమిటో తెలుసుకోవటం ముఖ్యం. సాధారణంగా చాలామంది దంపతులకు తొలిసారి కలయిక పట్ల భయం ఉంటుంది ఆ భయం కారణంగానే వారు అసౌకర్యంగా ఫీలవుతూ శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు.
కలయికలో పాల్గొంటే నొప్పిగా ఉంటుందేమో, బరువు (Weight) ఎక్కువగా ఉండటం కారణంగా భాగస్వామికి పూర్తిగా సంతృప్తిని (Satisfaction) అందించడంలేదేమో, కలయిక పట్ల తాము సరిగా స్పందించలేదేమో ఇలా పలు రకాలుగా ఆలోచించి లేనిపోని అనుమానాలు పెంచుకుంటారు. ఇలాంటి అనుమానాలు అందరిలోనూ రావడం సర్వసాధారణం.
ఇలా అనుమానాలు ఉంటే డాక్టర్ను కలిసి కౌన్సెలింగ్ (Counseling) తీసుకోవచ్చు. ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే సరైన డైట్ ఫాలో అవుతూ ప్రతి రోజూ ఒక గంట సమయం వ్యాయామానికి (Exercise) కేటాయించి బరువు తగ్గితే సరిపోతుంది. ప్రతిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి, అసౌకర్యం అనిపిస్తే ఆ నొప్పికి గల కారణం ఏంటో కష్టంగా తెలుసుకోవడం ముఖ్యం.
ఒకవేళ యోని పొడిబారి ఈస్ట్రోజన్ హార్మోన్ (Estrogen hormone) విడుదల కాకపోవడంతో ఈ సమస్య ఎదురు కావచ్చు. మోనోపాజ్ దశలో (Monopause phase) ఉన్నప్పుడు యోని మార్గంలోని పొర పల్చబడి నొప్పిగా అనిపిస్తే వైద్యులను సంప్రదించి వారి సూచనలను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన సమస్యలు, ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా కలయికను పూర్తిగా ఆస్వాదించలేరు.
ముఖ్యంగా కలయికలో నొప్పి కలగడానికి కారణం గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు (Fibroids) కారణం కావచ్చు. అలాగే అండాశయాల్లో సిస్టులు ఉన్నా, కొందరికి ప్రసవ సమయంలో యోని మార్గంలో గాయాలున్నా కలయికలో నొప్పి బాధిస్తుంది. ఏవైనా లైంగిక వ్యాధులు (Sexually transmitted diseases) ఉన్నా దంపతులిద్దరూ కలిసి లైంగిక జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు.
ఈ సమస్యలన్నింటినీ సెక్స్ థెరపీతో (Sex therapy) పరిష్కరించుకుంటే శృంగారం పట్ల భయం పోయి భాగస్వామితో సంపూర్ణమైన లైంగిక జీవితాన్ని గడపవచ్చు. మనలోని లేనిపోని భయాలే ముఖ్యంగా కలయికను అసౌకర్యంగా మారుస్తాయి. కనుక మనసును స్థిరంగా ఉంచుకొని సమస్యలు పరిష్కరించకుంటే శృంగార జీవితంతో పాటు దాంపత్య జీవితం (Marital life) కూడా బాగుంటుంది.