Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు ఏది తింటే మంచిది? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?

Published : Sep 26, 2026, 06:26 PM IST

Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు రెండింటిలోనూ పోషకాలు ఉంటాయి. కానీ, ఆరోగ్యపరంగా రెండింటిలోనూ చాలా తేడాలు ఉన్నాయి. అసలు.. ఈ రెండింటిలో ఏది తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది?

PREV
13
తాజా చేపలు తింటే మంచిదేనా?

మనకు మార్కెట్లో దొరికే తాజా చేపల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. తేమ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ డి, లీన్ ప్రోటీన్ లభిస్తుంది.

ఈ చేపలు తినడం వల్ల మన గుండె, మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి, కంటి చూపు మెరుగుపడటానికి ఎంతగానో సహాయపడతాయి. పచ్చి చేపలలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి హైబీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి పచ్చి చేపలు చాలా సురక్షితమైన ఎంపిక. పచ్చి చేపలను తాజాగా వండుకుని తినడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా రావు.

23
ఎండు చేపలు తినడం మంచిది కాదా..?

చేపలను ఎండబెట్టే ప్రక్రియలో నీరు ఆవిరి అయిపోతాయి. వాటిలోని కాల్షియం, ఐరన్, ప్రోటీన్ పెరుగుతాయి. ముఖ్యంగా ఈ ఎండు చేపలను ఎముకలతో సహా తింటే ఎండు చేపలలోని కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. పచ్చి చేపలతో పోలిస్తే ఎండు చేపలను చాలా కాలం పాటు పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు. ఎండు చేపలను తయారు చేసేటప్పుడు పాడవకుండా ఉండటానికి వాటికి విపరీతంగా ఉప్పు పట్టిస్తారు. అందువల్ల రక్తపోటు, కిడ్నీ సమస్యలు లేదా ఉప్పు వినియోగం తగ్గించాలని డాక్టర్లు సూచించిన వారు ఎండు చేపలకు దూరంగా ఉండటం మంచిది. ఎండు చేపలు గట్టిగా ఉండటం వల్ల జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి తొందరగా అరగవు.

33
రెండింటిలో ఏది మంచిది..?

సాధారణ రోజువారీ ఆరోగ్యానికి, గుండె , మెదడు పనితీరుకు పచ్చి చేపలే అత్యంత ఉత్తమమైనవి. అయితే, అప్పుడప్పుడు మీరు కావాలంటే ఎండు చేపలు తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories