Fry Piece Mutton Dum Biryani: నెల్లూరు స్టైల్ ఫ్రై పీస్ మటన్ దమ్ బిర్యానీ..వీకెండ్ సెట్ అంతే

Published : Sep 26, 2026, 06:23 PM IST

Fry Piece Mutton Dum Biryani: మటన్ బిర్యానీ అంటేనే నోరూరించే మసాలా, ఘుమఘుమలు, టెండర్ మటన్ గుర్తొస్తాయి. అయితే రెగ్యూలర్ బిర్యానీ కాకుండా ఈ నెల్లూరు స్టైల్ ఫ్రై పీస్ మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. వీకెండ్ సెట్ అంతే.

PREV
15
ఘాటు పొగలతో మటన్ బిర్యానీ

వీకెండ్ లో నాన్ వెజ్ లేకపోతే ఎలా? ప్రతీసారీ రెస్టారెంట్ కు వెళ్లి ఏం తింటాం చెప్పండి. ఇంట్లోనే రెసిపీస్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎప్పుడూ ఒకటే కాకుండా వెరైటీస్ ట్రై చేస్తుండాలి. ఘాటు పొగలతో వండుతుంటే ఆ వాసనకే కడుపు నిండిపోద్ది. మామూలుగా మటన్ బిర్యానీ అంటేనే నోరూరించే మసాలా, ఘుమఘుమలు, టెండర్ మటన్ గుర్తొస్తాయి.

25
మటన్ బాగా ఉడకాలి

ముందుగా అరకిలో మటన్ ముక్కలను బాగా కడగాలి. ఒక కలాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, స్టార్ పువ్వు, లవంగాలు, కొంచెం సాల్ట్, మటన్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అరటీస్పూన్ మిరియాలు, టేబుల్ స్పూన్ ఆయిల్, రెండున్నర కప్పుల వేడి నీళ్లు వేసి కుక్కర్ పెట్టేయాలని. 7, 8 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దించేయాలి. మటన్ సేపరేట్ చేసి స్టాక్ పడేయకుండా ఉంచుకోవాలి.

35
మసాలా తయారీ విధానం

ధనియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాసపువ్వు, జీలకర్ర, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, 4, 5 ఎండు మిర్చి, యాలకులు, కసూరి మేతి వేసి గోరువెచ్చగా వేపాలి. అంతే. ఎక్కువగా వేపితే బిర్యానీ చేదు వస్తుంది. వాటిని మిక్సి పట్టి పౌడర్ చేసుకోవాలి.

45
ఫ్రై పీస్ మటన్ తయారీ

కాస్త ఎక్కువగానే నూనె వేయాలి. నాన్ వెజ్ కు నూనె ఉంటేనే రుచి ఉంటుంది. నూనె వేడెక్కాక అరకప్పు ఉల్లి తరుగు, కరివేపాకు వేసి వేయించండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక,...ఉడికిన మటన్ వేసి వేపాలి. మటన్ లోని ఆవిరి పోయేదాకా వేపి...చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. మీకు సరిపడా, కారాలు, ఉప్పు వేసుకోవాలి. కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలుపుకోవాలి.

55
బిర్యానీ దమ్

కడాయిలో నూనె పోసి మరాఠీ మొగ్గ, దాల్చినచెక్క, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, యాలకులు వేసి వేగాక..అందులోనే ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి వేయించాలి. అడుగుపట్టకుండా ఉండాలంటే అందులోనే మటన్ స్టాక్ వేయాలి.కసూరీ మేతి వేసుకోవాలి. అన్నీ వేగాక ముందుగానే నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతీ రైస్ వేసి, కాస్త ఉప్పు కూడా వేసి గింజ విరక్కుండా కలపాలి. చెమ్మ ఆరేదాకా కలపాలి. బియ్యానికి సరిపడా వాటర్ పోయాలి. ఆల్రెడీ పెట్టుకున్న స్టాక్ వేసి..అది సరిపోకపోతే అప్పుడు మిగతా నీళ్లు పోసుకోవాలి. అప్పుడే రైస్ కూడా మటన్ ఫ్లేవర్ తెలుస్తుంది.

ఇప్పుడు బిర్యానీ మీద మటన్ ఫ్రై పెట్టి కాసేపు దమ్ పెడితే సరిపోద్ది. అంతే మటన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ

Read more Photos on
click me!

Recommended Stories