Cooking Hacks: శనగలు, రాజ్మా నానపెట్టడం మర్చిపోయారా? అయినా మెత్తగా ఉడకపెట్టే ట్రిక్ ఇది

Published : Sep 19, 2026, 07:00 AM IST

Cooking Hacks: రోజూ చేసే వంట అయినా ఒక్కోసారి పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఆ పొరపాటు కారణంగా సమయానికి వంట పూర్తి కాదు. లేదంటే.. రుచిగా రాకపోవచ్చు. ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే.. కొన్ని చిట్కాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

PREV
13
కుకింగ్ హ్యాక్స్...

వంట చేయడం అంత సులువేమీ కాదు. కొన్ని రకాల కూరలు ఉదయాన్నే వండాలంటే.. దానికి రాత్రే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ముఖ్యంగా రాజ్మా, శనగలు లాంటివి కూరలు చేయాలన్నా.. లేదంటే.. పూజకు ప్రసాదానికి పెట్టాలన్నా.. కనీసం 6 నుంచి 7 గంటల పాటు నానపెట్టాల్సి ఉంటుంది. వాటిని పొరపాటున నానపెట్టడం మర్చిపోయాం అంటే.. వాటిని వండటం అసాధ్యం. కానీ, ఇక నుంచి ఆ సమస్య లేదు. రాజ్మా, శనగలు లాంటివాటిని నానపెట్టడం మర్చిపోయినా కూడా.. కేవలం గంట సమయం ఉన్నా.. వాటిని మెత్తగా ఉడికించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

23
ఈ స్టెప్స్ ఫాలో అయితే... రాజ్మా, శనగలు ఉడికించడం చాలా ఈజీ..

ముందుగా రాజ్మా లేదా శనగల గింజలను నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోండి. మరోవైపు ఒక పాత్రలో నీటిని బాగా మరిగించండి. బాగా కడిగిన రాజ్మాను ఒక కాస్రోల్ లేదా హాట్ బాక్స్‌లో వేసి, దానిపై మసలుతున్న వేడి నీటిని పోయాలి. వేడి నీరు పోసిన తర్వాత 2-3 సెకన్ల పాటు ఆవిరి బయటకు పోనిచ్చి, వెంటనే మూతను గట్టిగా పెట్టేయాలి. ఒక గంట పాటు.. కదిలించకుండా పక్కన పెట్టేయాలి. గంట తర్వాత చూస్తే.. రాజ్మా చక్కగా నాని మెత్తగా మారతాయి. ఆ తర్వాత ఎప్పటిలాగే కుక్కర్‌లో వేసి 4 నుండి 5 విజిల్స్ రానిస్తే.. పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి.

33
రుచికరమైన రాజ్మా మసాలా కర్రీ తయారీ:

బాణలిలో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ, టమాటో పేస్ట్‌లను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. అందులో రుచికి సరిపడా కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మసాలాను బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మాను ఆ మసాలాలో వేసి, గ్రేవీ చిక్కబడే వరకు కొన్ని నిమిషాలు సన్నని మంటపై మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుంటే ఘుమఘుమలాడే రాజ్మా కర్రీ రెడీ! దీనిని వేడివేడి అన్నం లేదా జీరా రైస్‌తో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

ఈ హ్యాక్ కేవలం రాజ్మాకే కాకుండా... శనగలు, బటానీలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories