Washing Machine Hacks: వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఒకదానికొకటి చుట్టుకుపోయి, బటన్స్ ఊడిపోతున్నాయా? ముడతలు, చిక్కులు లేకుండా బట్టలు విడివిడిగా రావాలంటే ఓ చిన్న ట్రిక్ ఉంది. అసలు ఏం చేయాలో తెలుసా?
వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఒకదానికొకటి చుట్టుకుపోయి, బటన్స్ ఊడిపోతున్నాయా? ముడతలు, చిక్కులు లేకుండా బట్టలు విడివిడిగా రావాలంటే ఓ చిన్న ట్రిక్ ఉంది. అసలు ఏం చేయాలో తెలుసా? వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడం చాలా ఈజీ. కానీ, ఉతికిన తర్వాత వాటిని బయటకు తీయడమే పెద్ద తలనొప్పి. షర్టులు, ప్యాంట్లు, చున్నీలు అన్నీ ఒకదానికొకటి ముడిపడిపోయి చిక్కుకుపోతాయి. వాటిని లాగి విడదీసేటప్పుడు బట్టలు చిరిగిపోవడం, బటన్స్ ఊడిపోవడం లేదా బాగా ముడతలు పడటం మనం రోజూ చూసేదే.
26
సమస్యకు పరిష్కారం చాలా సులభం
ఈ చిక్కుల సమస్యకు ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. అదే 'సిలికాన్ లాండ్రీ బాల్స్' (Silicone Laundry Balls). ఇవి నిజంగానే పనిచేస్తాయా? వీటిని ఎలా వాడాలి? ఎక్కడ దొరుకుతాయి? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
36
సిలికాన్ లాండ్రీ బాల్స్ ఎలా పనిచేస్తాయి?
ఈ బాల్స్ చాలా మెత్తటి సిలికాన్ లేదా రబ్బర్‌తో తయారవుతాయి. మీరు వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు, వాటితో పాటే 4 నుంచి 6 సిలికాన్ లాండ్రీ బాల్స్ వేసి మెషీన్ ఆన్ చేయండి. మెషీన్ తిరుగుతున్నప్పుడు ఈ బాల్స్ బట్టల మధ్య నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల బట్టలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి చుట్టుకుపోకుండా, ముడిపడకుండా ఈ బాల్స్ సహజంగానే అడ్డుకుంటాయి.
వాష్ పూర్తయిన తర్వాత బట్టలను బయటకు తీసేటప్పుడు, ఎలాంటి చిక్కులు లేకుండా ఒక్కో బట్ట చాలా సులభంగా బయటకు వస్తుంది. బట్టలు ఒకదానికొకటి చుట్టుకోవు కాబట్టి, వాటిపై ఎక్కువగా ముడతలు పడవు. దీంతో ఐరన్ (Iron) చేసుకునే పని కూడా సులువవుతుంది. ఈ బాల్స్ బట్టలపై రుద్దుకోవడం వల్ల మురికి, మరకలు త్వరగా వదిలిపోవడానికి సహాయపడతాయి. బట్టలను బలవంతంగా లాగి విడదీసే అవసరమే రాదు కాబట్టి, బట్టలు ఎక్కువ కాలం మన్నుతాయి.
56
ఎక్కడ దొరుకుతాయి?
1. ఆన్‌లైన్‌లో (చాలా ఈజీగా దొరుకుతాయి) అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), మీషో (Meesho): ఈ యాప్స్‌లో "Silicone Laundry Balls" లేదా "Washing Machine Cleaning Balls" అని సెర్చ్ చేస్తే చాలు, వెంటనే కనిపిస్తాయి.
బ్లింకిట్ (Blinkit) / జెప్టో (Zepto) / ఇన్‌స్టామార్ట్ (Instamart): ఇలాంటి క్విక్ కామర్స్ యాప్స్‌లోని 'Home Needs' సెక్షన్‌లో కూడా ఇవి దొరుకుతాయి.
2. ఆఫ్‌లైన్ స్టోర్లలో డి-మార్ట్ (D-Mart) లేదా రిలయన్స్ స్మార్ట్ బజార్ లాంటి పెద్ద సూపర్ మార్కెట్లలోని 'ప్లాస్టిక్ / క్లీనింగ్ ఐటమ్స్' సెక్షన్‌లో ఇవి ఉంటాయి. అలాగే స్థానిక ప్లాస్టిక్ షాపులు, హోమ్ యుటిలిటీ స్టోర్లలో కూడా లభిస్తాయి.
66
ధర ఎంత?
ఇవి చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. సాధారణంగా 4 నుంచి 8 బాల్స్ ఉండే ఒక ప్యాక్ ధర రూ.99 నుంచి రూ.200 రూపాయల వరకు ఉంటుంది. ఇవి రబ్బర్ లేదా సిలికాన్‌తో తయారవుతాయి కాబట్టి, సంవత్సరాల తరబడి మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు.