Pressure Cooker: కిచెన్ లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. వంట త్వరగా కావడంలో కుక్కర్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రెషర్ కుక్కర్ లో కొన్ని సంకేతాలు కనిపిస్తే వెంటనే మార్చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ప్రెషర్ కుక్కర్ మూత సరిగ్గా ఫిట్ కావడం సురక్షితమైన వంటకు చాలా ముఖ్యం. మూత పెట్టిన తర్వాత కూడా అది సరిగ్గా ఫిట్ అవ్వకపోయినా, వంగినట్లు అనిపించినా, అంచులు దెబ్బతిన్నా ఆ కుక్కర్‌ను వాడకపోవడం మంచిది. కుక్కర్ మూత లేదా బాడీకి సొట్టలు పడటం, వంగిపోవడం, పగుళ్లు రావడం లాంటివి చిన్న సమస్యలు కావు. ఇది ప్రెషర్‌తో పనిచేసే వస్తువు కాబట్టి ఇలాంటి డ్యామేజ్‌లను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
26
మూత చుట్టూ ఆవిరి లీక్ కావడం
కుక్కర్ మూత అంచుల నుంచి ఆవిరి బయటకు వస్తుంటే, ముందుగా గ్యాస్‌కెట్ (రబ్బరు రింగ్) చెక్ చేయాలి. గ్యాస్‌కెట్ పాతబడి గట్టిపడినా, వదులైనా లేదా పగుళ్లు వచ్చినా మూత సరిగ్గా బిగుసుకోదు. దీనికోసం కుక్కర్ మొత్తాన్ని మార్చేయాల్సిన అవసరం లేదు. మీ కుక్కర్ సైజు, మోడల్‌కు సరిపోయే మంచి క్వాలిటీ గ్యాస్‌కెట్ వేస్తే చాలు ఈ సమస్య తీరిపోతుంది.
36
సేఫ్టీ వాల్వ్‌లో సమస్య
ప్రెషర్ కుక్కర్‌లో ఉండే సేఫ్టీ వాల్వ్ అనేది ఏదో చిన్న పార్ట్ కాదు. కుక్కర్‌లో ప్రెషర్ ఎక్కువైతే దాన్ని సురక్షితంగా బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వాల్వ్ డ్యామేజ్ అవ్వడం, పగుళ్లు రావడం, తుప్పు పట్టడం, బ్లాక్ అవ్వడం, సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. పాడైన సేఫ్టీ వాల్వ్‌తో కుక్కర్‌ను వాడొద్దు. కంపెనీ సూచనల ప్రకారం సరైన స్పేర్ పార్ట్‌తో దాన్ని మార్చాలి.
కుక్కర్ మెయిన్ బాడీలో పగుళ్లు, లోతైన సొట్టలు లేదా పెద్ద డ్యామేజ్ జరిగితే, కేవలం గ్యాస్‌కెట్ మార్చి వాడటం సరైన పరిష్కారం కాదు. ప్రెషర్‌తో పనిచేసే వస్తువు బాడీ దెబ్బతింటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు ఏమైనా అనుమానం ఉంటే కంపెనీ సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించడం మంచిది.
56
హ్యాండిల్ లూజ్ అవ్వడం లేదా విరిగిపోవడం
హ్యాండిల్ అనేది కేవలం వంట సౌకర్యం కోసం ఉండే పార్ట్ కాదు. కుక్కర్‌ను సురక్షితంగా పట్టుకుని పక్కన పెట్టడానికి, మూతను సరిగ్గా తీయడానికి ఇది చాలా అవసరం. హ్యాండిల్ వదులైనా, విరిగిపోయినా, అది బిగించే చోట డ్యామేజ్ ఉన్నా, రిపేర్ చేయకుండా కుక్కర్‌ను వాడకూడదు.
66
విజిల్ లేదా ప్రెషర్ తేడాగా రావడం
కుక్కర్ ఎప్పటిలాగా పనిచేయకపోవడం కూడా మనం గమనించాల్సిన ముఖ్యమైన సంకేతం. మామూలు కంటే భిన్నంగా ఆవిరి బయటకు రావడం, విజిల్ వచ్చే విధానం మారడం, పెద్దగా శబ్దం రావడం, ప్రెషర్ సరిగ్గా రాకపోవడం, వాల్వ్ దగ్గర లీక్ అవ్వడం లాంటి సమస్యలు ఉంటే కచ్చితంగా రిపేర్ చేయించాలి.
కుక్కర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే?
ప్రతిసారి వాడిన తర్వాత కుక్కర్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ముఖ్యంగా గ్యాస్‌కెట్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. ఆవిరి బయటకు వెళ్లే దారిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. సేఫ్టీ వాల్వ్‌ను చెక్ చేయాలి. మూత, దాని అంచులకు ఏమైనా డ్యామేజ్ ఉందేమో చూడాలి. అలాగే, కుక్కర్ కెపాసిటీకి మించి నింపకూడదు.