స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలల్లో ఆంథోసైనిన్లు, ఎల్లాగిటానిన్లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ స్ట్రాబెర్రీలను చాలా శక్తివంతమైనవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని ఆపుతాయి. శరీర కణ నిర్మాణాలను కాపాడుతాయి. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్ , ఇతర సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి కూడా.