వానలు పడుతున్నప్పుడు ఆస్తమా రోగులు ఈ ఆహారాలను తినడం మంచిది..

Published : Oct 18, 2022, 01:50 PM IST

వాతావరణం, ఆహారం, జీవన శైలి వంటి కారణాల వల్ల ఆస్తమా వస్తుంది. ఏదేమైనా ఆస్తమా రోగులు వర్షాలు పడుతున్నప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.    

PREV
16
 వానలు పడుతున్నప్పుడు ఆస్తమా రోగులు ఈ ఆహారాలను తినడం మంచిది..

ప్రపంచంలోని అత్యంత సాధారణ వ్యాధుల జాబితాలో ఆస్తమా ఒకటి. ఆస్తమాకు చికిత్స లేదు. కానీ మందులతో దీనిని నియంత్రించొచ్చు. వాతావరణం, జీవనశైలి,ఆహారం వంటి అనేక కారకాలు ఆస్తమాతో ముడిపడి ఉన్నాయి. అయితే ఆస్తమా రోగులు ఇతర కాలాలతో పోల్చితే వర్షాకాలంలోనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఇంతకీ వర్షాలు పడుతున్నప్పుడు ఆస్తమా పేషెంట్లు ఎలాంటి ఆహారాలను తింటే మంచిదో తెలుసుకుందాం పదండి.. 

26

అల్లం

అల్లం ఆస్తమా రోజులకు మెడిసిన్స్ తో సమానం. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషద గుణాలుంటాయి. దీనిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అందుకే ఆస్తమా రోగులు దీన్ని నీటిలో వేసి మరిగించి తాగితే మంచి ప్రయోజనం పొందుతారు. 

36
garlic

వెల్లుల్లి

వెల్లుల్లి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోనాలను కలిగి ఉంటుంది. దీనిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక గ్లాసు నీటితో కలిపి రోజుకు ఒకసారి తాగితే మంచిది. లేదా అరకప్పు పాలలో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగినా ఆస్తమా పేషెంట్లకు మంచిది. 
 

46

పసుపు

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి.  పసుపులో ఉండే కర్కుమిన్ ఎన్నో అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటితో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. అందుకే ఆస్తమా రోగులు పసుపును ఖచ్చితంగా తీసుకోవాలి. 

56

 ఆకు కూరలు

ఆకు కూరలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటివల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూరలో విటమిన్లు, ప్రోటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా రోగుల ఆరోగ్యానికి బచ్చలికూర చాలా మంచిది. 
 

66

ఉసిరి

ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అందుకే ఆస్తమా రోగులు మర్చిపోకుండా ఉసిరి కాయను తినాలి. ఉసిరి జుట్టు, చర్మానికి కూడా మేలు చేస్తుంది. 

గ్రీన్ టీ

యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గ్రీన్ టీ శరీరంలోని ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడుతుంది. అందుకే ఆస్తమా రోగులు వర్షాకాలంలో గ్రీన్ టీని తప్పకుండా తాగాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories