ధనవంతులు అవ్వాలని ఉంటే.... ఈ అలవాట్లు నేర్చుకోవాలి...!

First Published Oct 18, 2022, 1:15 PM IST

రెండు, మూడు డబ్బు ఆర్జించే పనులపై ఫోకస్ పెట్టాలి. ఒక ఉద్యోగం చేస్తున్నా.. రెండు, మూడు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే.. ఎక్కువ సంపాదించవచ్చు.

ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ.... అది అంత సులువేమీ కాదు.. చాలా మంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతుంటారు. కానీ... అలా అని వారు ధనవంతులు మాత్రం కాలేరు. నిజంగా ధనవంతులు కావాలంటే... కొన్ని అలవాట్లు అలవాటు చేసుకోవాలట. అవేంటో ఓసారి చూద్దాం..
 

Gold and money


1.డబ్బు సంపాదించాలి అంటే... కేవలం ఒక్కదాని పై ఫోకస్ పెట్టడం వల్ల సాధ్యం కాదు. ఎక్కువ డబ్బు సంపాదించాలి అంటే... ఒకే సమయంలో.. రెండు, మూడు డబ్బు ఆర్జించే పనులపై ఫోకస్ పెట్టాలి. ఒక ఉద్యోగం చేస్తున్నా.. రెండు, మూడు చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే.. ఎక్కువ సంపాదించవచ్చు.


2.మనం డబ్బు సంపాదించాలి అంటే.. మనతో ఉన్న స్నేహితులపై కూడా ఆధారపడి ఉంటుందట. లక్ష్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేసేవారి తో ఎక్కువగా స్నేహం చేయాలట. దాని వల్ల మనకు కూడా మన లక్ష్యం ఎప్పుడూ గుర్తుంటుంది.


3.మన లక్ష్యం,  కలలు కూడా పెద్దగా ఉండాలి.  తక్కువగా ఉండటం వల్ల ఉపయోగం ఉండదు. మీ మైండ్ ని మనం సెట్ చేసుకునేదానిపై ఆధారపడి ఉంటుంది.

4.భవిష్యత్తులో  ఉపయోగించుకోవడానికి డబ్బు ఆదా చేయడం నేర్చుకోవాలి. కాబట్టి.. డబ్బును వివిధ సెక్టార్ లలో సేవ్ చేయడం నేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల డబ్బు ఎక్కువ ఆదా చేయవచ్చు.

5.ధనవంతుల అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా... వారు ప్రతి విషయంలో బడ్జెట్ వేసుకుంటారు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలో  వీరికి బాగా తెలుసు. తమ బడ్జెట్ కి తగ్గుట్లుగానే వారు ఖర్చు చేస్తారు.


6.ధనవంతులు కావాలి అనుకునేవారిలో ఉండే ముఖ్యమైన అలవాటు ఏంటో తెలుసా..? వారు ఉదయాన్నే లేస్తారట. వారు చాలా క్రమశిక్షణతో  ఉంటారు. 
 

Black Money


7.ధనవంతులు.. తమ లక్ష్యాల పట్ల చాలా క్లియర్ గా ఉంటారు. వారు డబ్బు విషయంలో వారికి లక్ష్యాలు చాలా ఉంటాయి. వారికి ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే క్లారిటీ ఉంటుంది.

click me!