చక్కెర ఒక్కటే కాదు ఇవి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతయ్ జాగ్రత్త..

First Published Dec 5, 2022, 9:46 AM IST

చక్కెరను తింటే షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న ముచ్చట అందరికీ ఎరుకే.. నిజానికి చక్కెర ఒక్కటే కాదు మరెన్నో ఆహారాలు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. అవేంటంటే.. 

diabetes

డయాబెటీస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న రోగాల్లో ఒకటిగా మారిపోయింది. ఏడాదికి ఏడాదికి దీని  బారిన పడ్డవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.  రక్తంలో షుగర్ లెవెల్స్ పెరడానికి దారితీసే ప్రధాన కారకాల్లో చక్కెర ఒక్కటి. అందుకే మధుమేహులు తాము తినే ఆహారాల్లో ఎంత చక్కెర ఉందని చెక్ చేస్తుంటారు. 

sugar

ఒక్క చక్కెర మాత్రమే కాదు.. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేందుకు దారి తీసే పదార్థాలు చాలానే ఉన్నాయి. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే ఈ ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్యాక్ చేసిన స్నాక్స్

నిజానికి ప్యాకేజ్డ్ స్నాక్స్ కూడా డయాబెటీస్ ను దారితీస్తాయి. ఎందుకంటే ఇవి శుద్ధి చేసిన పిండితో తయారవుతతాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెంచుతాయి. అందుకే మీరు కొన్న ప్యాకేజ్డ్ స్నాక్స్ కవర్ పై కార్భోహైడ్రేట్ కంటెంట్ ఎంతుందో చదవండి. కొన్ని స్నాక్స్ ప్యాకెట్ పై పేర్కొన్న దానికంటే ఎక్కువ పిండిపదార్థాలు కూడా ఉండొచ్చు.. జాగ్రత్తగా ఉండండి. భోజనానికి మధ్యలో తినాలనిపిస్తే.. ప్యాకేజ్డ్ స్నాక్స్ కు బదులుగా ఆరోగ్యకరమైన గింజలను తినండి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఏ మాత్రం పెంచవు. 
 

డ్రై ఫ్రూట్స్

పండ్లలో ఎక్కువ మొత్తంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇక ఎండిన పండ్లలో చక్కెర సాంద్రీకృత రూపంలో ఉంటుంది. ఎండిన పండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఎండుద్రాక్షల్లో 115 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. ఇది ఎండని ద్రాక్షలో కంటే చాలా ఎక్కువ. ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ ను తినాలనుకుంటే చక్కెర తక్కువగా ఉండే పండ్లను మాత్రమే తినండి. 
 

alcohol

ఆల్కహాల్ పానీయాలు

ఆల్కహాలిక్ పానీయాల్లో చక్కెరతో పాటుగా పిండిపదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవాళ్లు బీర్, వైన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలని డాక్టర్లు సలహానిస్తున్నారు. మద్యాన్ని ఓవర్ గా తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా దీనివల్ల మధుమేహులు డైలీ మెడిసిన్స్ ను వాడాల్సి వస్తుంది. 
 

పండ్ల రసం

పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. చక్కెర ఎక్కువగా ఉండే పంట్లను మాత్రం మోతాదులోనే తినాలి. కానీ పండ్ల రసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎండిన పండ్ల మాదిరిగానే పండ్ల రసాలలో కూడా  సాంద్రీకృత పండ్ల చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచుతుంది. పండ్ల రసాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే డయాబెటీస్ ల ఆరోగ్యం క్షీణిస్తుంది. 


వేయించిన ఆహారాలు

వేయించినన ఆహారాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిను దారుణంగా పెంచుతాయి.  ఈ ఆహారాలను తింటే ప్రారంభంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే కొవ్వులు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైం పడుతుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. వీటిలో కొవ్వు మాత్రమే కాదు ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తాయి. 
 

ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు

వైట్ బ్రెడ్, పాస్తా మైదాతో చేసిన ఆహారాలన్నీ శుద్ది చేసిన పిండితో తయారుచేసినవే. కానీ ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. పోషకాలు మొత్తమే ఉండవు. మధుమేహులు వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తినండి.   
 

click me!