మీరు రాత్రి 9 గంటల తర్వాతే తింటారా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం..

First Published Dec 4, 2022, 3:57 PM IST

రాత్రిపూట ఎంత తొందరగా తింటే ఆరోగ్యానికి అంత మంచిది. రాత్రి 9 గంటల తినే అలవాటు అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే..
 

రాత్రిపూట తినే భోజనం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. తినే ఆహారం కావొచ్చు.. తినే టైం కావొచ్చు. అందుకే రాత్రిపూట సరైన సమయంలో.. సరైన మార్గంలో తినడం చాలా ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా రాత్రిపూట చాలా లేట్ గా తింటుంటారు. అయితే ఆలస్యంగా తినే ఈ అలవాటు మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అర్థరాత్రి భోజనం చేసే అలవాటుంటే వెంటనే మానుకోండి. లేకపోతే లేనిపోని రోగాలొస్తయ్..

రాత్రి 9 గంటల తర్వాత తినడం ఆరోగ్యానికి చాలా హానికరమని పరిశోధనలో తేలింది. ఎందుకంటే నిద్రకు, భోజనానికి మధ్య 2 గంటల గ్యాప్ ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది తిన్నవెంటనే పడుకుంటుంటారు. ఇలా పడుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల శరీర జీవక్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్ల మన శరీరం ఎన్నో రోగాల బారిన పడుతుంది.  రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా అధ్యయనాలు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే భోజనం చేయడం మంచిదని వెల్లడించాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి వ్యాధులొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

జీర్ణ సమస్యలు

రాత్రి పూట ఆలస్యంగా తినే అలవాటు ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రాత్రి తిన్న తర్వాత ఎలాంటి శారీరక పనులు చేయరు. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనివల్ల అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. 
 

బరువు పెరుగుతారు

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. సకాలంలో తినకపోవడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల వినియోగించే క్యాలరీలు సరిగా కరిగిపోవు. అలాగే శరీర కొవ్వు పెరగడం మొదలవుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనం తర్వాత ఎటువంటి శారీరక కార్యకలాపాలు చేయకపోయినా.. భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల గ్యాప్ ఉండేట్టు చూసుకోవాలి. 

ఒక పరిశోధన నివేదిక ప్రకారం.. రెగ్యులర్ గా అర్థరాత్రి తినే అలవాటున్న వారికి హై బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆలస్యంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. దీంతో గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
 

నిద్ర లేకపోవడం

రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాకపోవడానికి కారణాల్లో ఆలస్యంగా తినడం కూడా ఒకటి. లేట్ గా తినడం వల్ల మన శరీరం దాన్ని సరిగ్గా జీర్ణించుకోలేకపోతుంది. ఫలితంగా నిద్రసరిగ్గా రాదు. 
 

శక్తి స్థాయిలు తగ్గుతాయి

రాత్రి ఆలస్యంగా తినడం వల్ల మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయదు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. అలాగే శరీర శక్తి స్థాయిలు కూడా తక్కువగా ఉంటాయి.

మెదడుకు ప్రమాదకరం

అర్థరాత్రి తిన్నడం బ్రెయిన్ కు అంత మంచిది కాదు. దీనివల్ల రాత్రిపూట నిద్రలేమి, కడుపునకు సంబంధించిన ఎన్నో ఇతర సమస్యలు వస్తాయి. వీటిమూలంగా మరుసటి రోజు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ప్రభావితం అవుతాయి. అంటే ఇది మీ మెమోరీ పవర్ ను తగ్గిస్తుందన్న మాట. మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటును వెంటనే మానుకోవడం ఆరోగ్యానికి మంచిది. 

click me!