థైరాయిడ్ తో బరువు పెరిగిపోయారా? ఇలా తగ్గించుకోండి

First Published Dec 4, 2022, 4:56 PM IST

థైరాయిడ్ వల్ల శరీరంలో ఎన్నో రకాల మార్పులొస్తాయి. ముఖ్యంగా బరువు పెరిగిపోవడం. థైరాయిడ్ రుగ్మత వల్ల పెరిగిన బరువును తగ్గించుకోవడం అంత సులువు కాదు. కానీ..

thyroid

అకస్మత్తుగా బరువు పెరగడం థైరాయిడ్ మొదటి లక్షణం. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికాకపోవడం వల్ల శరీర పనితీరు నెమ్మదిస్తుంది. దీనివల్ల మీరు బరువు పెరుగుతారు. శారీరక శ్రమలో పాల్గొంటూ, ఒత్తిడిని తగ్గించుకుంటే బరువు తగ్గడం సులువు అవుతుంది. అలాగే పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాలను తిన్నా బరువు తగ్గడం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

అయోడిన్

మన శరీరానికి అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ మన శరీరంలో ఎన్నో విధులను నిర్వహించడానికి సహాయపడుతుంది. కాగా అయోడిన్ వినియోగాన్ని పెంచడం ద్వారా చాలా మంది ఆకస్మికంగా బరువు తగ్గతారని కనుగొనబడింది. అయోడైజ్డ్ ఉప్పు, సీఫుడ్, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి అయోడిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. 
 

fiber

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఖచ్చితంగా, ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే మీ జీర్ణక్రియను ప్రతిరోజూ మెరుగుపరచాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఫైబర్ కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. హానికరమైన కాలుష్య కారకాలను శరీరం నుంచి తొలగిస్తుంది.
 

విటమిన్ డి
 
విటమిన్ డి ఎముకలను, దంతాలను బలంగా ఉంచుతుంది. అలాగే థైరాయిడ్ పనితీరును నియంత్రించడంలో ఇది ముఖ్యమైన  పాత్ర పోషిస్తుంది. గుడ్లు, కొవ్వు చేపలు, అవయవ మాంసం, పుట్టగొడుగులు, అవొకాడోలు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా కూడా మీరు విటమిన్ డిని పొందుతారు. 
 

రాగి

థైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేయడానికి రాగి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. బాదం, నువ్వులు, చిక్కుళ్ళు వంటి ఆహారాల్లో రాగి పుష్కలంగా ఉంటుంది. 

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మన శరీరానికి చాలా అవసరం. ఇవి బరువును తగ్గించడానికి, నియంత్రణలో ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు థైరాయిడ్ గ్రంథి మంటను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. వాల్ నట్స్, అవిసె గింజలు, చియా విత్తనాలు, నెయ్యి, కొవ్వు చేపలు వంటి కొన్ని ఆహారాల్లో  ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 
 

fruits

పండ్లు

పండ్లను తినడం ద్వారా మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. థైరాయిడ్ గ్రంథిని ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షించేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటే పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆపిల్, బెర్రీలు, అవోకాడోలు మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి.

click me!