మన మూడ్ బాగుంటేనే మనం హ్యాపీగా ఉంటాం. లేదంటేనా.. ఇతరులు ఎంత ప్రేమగా మాట్లాడినా చిరాకొస్తుంది. ఇలాంటి సమయంలో ఇతరులతో అస్సలు మాట్లాడాలనిపించదు. ఏదీ చేయాలనిపించదు. అయితే కొన్ని రకాల ఫుడ్స్ ను తింటే మాత్రం మీ మూడ్ ఆటోమెటిగ్ గా సెట్ అవుతుంది. ఇవి మిమ్మల్ని ఎనర్జిటిక్ గా చేయడంతో పాటుగా.. హుషారుగా కూడా చేస్తాయి. అయితే కొంతమంది మూడ్ బాగోలేదని బిస్కెట్లను క్యాండీ బార్స్ ను లాగిస్తుంటారు. నిజానికి ఇవి మూడ్ ను అస్సలు మార్చలేవని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల శరీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా డల్ గా మారితే.. వెంటనే ఈ ఆహారాలను తినండి. వెంటనే మీరు హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు.
26
banana
అరటిపండ్లు
అరటిపండ్లు మన ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి6, చక్కెర, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండ్ల మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
36
ఓట్స్
ఓట్స్ బరవును తగ్గించేందుకు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఓట్స్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. అలాగే హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. అందుకే వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినండి. రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు.
46
డార్క్ చాక్లెట్స్
డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోపడతాయి. వీటిని తింటే మూడ్ ఆటోమెటిక్ గా ఛేంజ్ అవుతుంది. ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే సమ్మేళనాలు డోపమైన్ ను పెంచేందుకు సహాయపడతాయి. దీంతో మీరు మరింత హ్యీపీ మూడ్ లో కి మారిపోతారు.
56
nuts
నట్స్
నట్స్ లో ఎన్నో పోషకాలుంటాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే శరీరంలో విటమిన్ల లోపం పోతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మూడ్ బాగాలేనప్పుడు కొన్ని గింజలను నమలడం వల్ల హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. ఇవి డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. నైట్ షిఫ్ట్ లో పని చేసేవారు మధ్యమధ్యలో వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది.
66
బీన్స్, కాయధాన్యాలు
బీన్స్, కాయధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటుగా ఉత్సాహంగా ఉంచుతాయి.