పసుపును ఎవరు తీసుకోకూడదు
పిత్తాశయ సమస్యలున్నవారు పసుపును తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే పసుపులో పిత్త స్రావాన్ని పెంచే లక్షణాలుంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఇప్పటికే మెడిసిన్స్ ను వాడుతున్న డయాబెటీస్ రోగులు కూడా పసుపును తీసుకోకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ మొత్తంలో తగ్గించేస్తాయి.
గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్ లేదా జీఇఆర్డి ఉన్నవారు కూడా పసుపును తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే ఇది మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
పసుపు శరీరం ఇనుమును శోషించుకునే సామర్థ్యానికి అంతరాయం కలిగిస్తుంది. అందుకే ఇప్పటికీ మీరు ఐరన్ లోపంతో బాధపడుతుంటే పసుపును తీసుకోకపోవడమే మంచిది.
కాలెయ వ్యాధి ఉంటే కూడా పసుపును తీసుకోకూడదు. ఇది కాలెయ వ్యాధిని మరింత ఎక్కువ చేస్తుంది.