ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే తెల్లజుట్టు వస్తోంది. దీనికి తోడు హెయిర్ ఫాల్, జుట్టు పగిలిపోవడం, డ్రై హెయిర్ వంటి సమస్యలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇక ఈ సమస్యలను పోగొట్టడానికి మార్కెట్ లోకి ఎన్నో కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో ఉండే కెమికల్స్ జుట్టును దెబ్బతీస్తాయి. అందుకే వీటిని యూజ్ చేయని వారు చాలా మందే ఉన్నారు. అయితే జుట్టును బాగు చేయడానికి మార్కెట్ లో ఉండే ప్రొడక్ట్స్ నే పెట్టక్కర్లేదు.. సహజసిద్దంగా ఉండే కొన్ని వస్తువులను జుట్టుకు అప్లై చేసినా.. జుట్టు నల్లగా మారుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిగి జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటుగా హెయిర్ ఫాల్ సమస్య కూడా ఆగిపోతుంది. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.