జుట్టు చిన్నగా ఉందని బాధపడుతున్నారా? వీటిని తినండి కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..

First Published Oct 7, 2022, 11:01 AM IST

ఆడవాళ్లకు జుట్టంటే మహా ఇష్టం. ఇక జుట్టు పెరిగేందుకు రకరకాల నూనెలు, షాంపూలను మార్చేవారు చాలా మందే ఉన్నారు. అవీ ఇవీ కాదు.. కొన్ని ఆహారాలను తింటే కూడా జుట్టు వేగంగా పెరుగుతుంది. 
 

అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా జుట్టంటే చాలా ఇష్టముంటుంది. ఇందుకోసం ఎన్నో రకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. ఇక ఇందులో అమ్మాయిలైతే జుట్టు పెరగాలని రకరకాల హెయిర్ ప్యాక్ లు, హెయిర్ గ్రోత్ ప్రొడక్ట్స్ లను ట్రై చేస్తుంటారు. అయినా జుట్టు ఇంచుకూడా పెరగని వారు చాలా మందే ఉన్నారు. అయినా ఈ రోజుల్లో పొడవైన జుట్టున్నవాళ్లు నూటికి ఒక్కరో ఇద్దరో ఉన్నారంతే.. నిజానికి జుట్టు పెరిగేందుకు షాంపూలు, నూనెలు కాదు.. లోపలి నుంచి పోషణ అందాలి. అప్పుడే కుదుళ్లు బలంగా ఉండి.. జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తింటే మాత్రం ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుంది. కాలుష్యం, దుమ్ము, దుళి వల్ల కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి ఏవి తింటే జుట్టు బలంగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Avocado

అవకాడో

అవకాడోలో ఎన్నోరకాల పోషకాలుంటాయి. ఇది  మీ జుట్టును బలంగా చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు వేగంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

క్యారెట్

భూమిలోపల పండే ఈ కూరగాయలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో విటమిన్ ఎ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచి కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది తల కణాల పెరుగుదలకు కూడా సహాయపడతుంది. అలాగే జుట్టు అందంగా మెరిసేందుకు కూడా ఉపయోగపడుతుంది. 
 

చేపలు 

చికెన్, మటన్ కంటె చేపలే మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి హెయిర్ ఫాల్ ను దూరం చేస్తాయి. అలాగే జుట్టు పొడవుగా, బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. 
 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ డి3, బయోటిన్, విటమిన్ బి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, జింక్, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ జుట్టును వేగంగా పెంచేందుకు సహాయపడతాయి. ఉడకబెట్టిన గుడ్డును తినడంతో పాటుగా పచ్చి గుడ్డును జుట్టుకు హోయిర్ ప్యాక్ వేసుకుని తలస్నానం చేస్తే కూడా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 

డ్రై ఫ్రూట్స్

ప్రతిరోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే పోషకాలు మీ జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడతాయి. అంతేకాదు వేగంగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. వాల్ నట్స్, బాదం పలుకులు, జీడిపప్పులను క్రమం తప్పకుండా తినండి. ఇవి మీ జుట్టు ఫాస్ట్ గా పెరిగేందుకు సహాయపడతాయి. 

click me!