షుగర్ వ్యాధి ప్రమాదకరమైన రోగం. దీనివల్ల శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలు రిస్క్ లో పడతాయి. అయినా ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం డయాబెటీస్ వ్యాధి బారిన పడతారు. చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. లైఫ్ స్టైల్ బాగుంటేనే డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇక వీటికి తోడు ‘ఒంటరితనం’ కూడా డయాబెటీస్ కు కారణమవుతుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడిస్తోంది.