ఇందుకోసమే ప్రతిరోజూ ఉదయం డ్రై ఫ్రూట్స్ ను తినాలంటరు..

First Published Oct 6, 2022, 5:00 PM IST

ప్రతిరోజూ ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల ఒకటి కాదు రెండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటంటే.. 

డ్రై ఫ్రూట్స్ అంటే.. ఎన్నో పండ్లు, బాదం పలుకులు, పిస్తాపప్పులు, జీడిపప్పులు, గింజలు, రెసిన్స్ వంటి ఎన్నో ఎండిన పండ్ల మిశ్రమం. డ్రై ఫ్రూట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే వీటిని హెల్తీ స్నాక్స్ అంటారు.  జర్నీలో వీటిని తింటే ఎనర్జిటిక్ గా ఉంటారని  చాలా మంది అంటుంటారు. నిజానికి డ్రై ఫ్రూట్స్ ను ఏ సమయంలోనైనా తినొచ్చు. 
 

సాధారణ పండ్లతో పోలిస్తే డ్రై ఫ్రూట్స్ ను నిల్వ చేయడం చాలా సులువు. ఇవి చాలా కాలం పాటు పాడవకుండా ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండ్లను ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ముందే ఈ సీజన్ లో దగ్గు, జ్వరం, జలుబు, ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. వీటికి తోడు కరోనా కూడా ఉంది. వీటన్నింటి నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉండాలంటే రోగనిరోధక  శక్తి ఎక్కువగా ఉండాలి. అయితే డ్రై ఫ్రూట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలుంటాయి . డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 
 

dry fruits

జుట్టు పెరిగేందుకు సహాయపడతుంది

బాదం, ఇతర డ్రై ఫ్రూట్స్ జుట్టు పొడుగ్గా పెరిగేందుకు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇవి మీ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి. అలాగే మీ శరీర శక్తి స్థాయిలను కూడా పెంచుతాయి. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలంగా మారుతాయి. ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని బాదం పప్పులతో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు

డ్రై ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ  ఆక్సిడెంట్లలో ఆంథోసైనిన్, ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి మెదడును రక్షిస్తాయి. అలాగే బ్రెయిన్ షార్ప్ గా పనిచేయడానికి కూడా సహాయపడతాయి. 

ఫైబర్ ఎక్కువగా ఉంటుంది

మన శరీరానికి కావాల్సిన రోజువారి ఫైబర్ కంటెంట్ డ్రై ఫ్రూట్స్ లో ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పండ్లు, డ్రై ఫ్రైట్స్ ప్రతి 1000 కేలరీలకు 14 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో  ఆప్రికాట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ద్వారా మీ శరీరానికి కావాల్సిన ఫైబర్ పొందాలనుకుంటే క్రాన్ బెర్రీస్, ఎండుద్రాక్ష, ఫ్రూనె వంటి డ్రై ఫ్రూట్స్ ను తినండి. 
 

ఇనుము  సమృద్ధిగా ఉంటుంది

ఖర్జూరాల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఖర్జూరాలు తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇనుము హిమోగ్లోబిన్ రక్త స్థాయిలను పెంచుతుంది. ఈ ఇనుము లోపం పురుషులతో పోల్చితే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ ను ఆడవాళ్లు ఎక్కువగా తినాలి. అది కూడా బ్రేక్ ఫాస్ట్ లోనే. ఇది రక్త స్థాయిలను బాగా పెంచుతుంది. 
 

ఆరోగ్యకరమైన చిరుతిండి

బరువు తగ్గాలనుకునే వాళ్లు బ్రేక్ ఫాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ ను తప్పకుండా తినాలి. ఎందుకంటే ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఎండిన పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మీ జీవక్రియను వేగం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. మీకు పోషకాల లోపం ఉంటే కూడా డ్రై ఫ్రూట్స్ ను తినండి. ఇవి ఎలాంటి పోషకాల లోపాన్నైనా పోగొడతాయి. మీ శరీర బలాన్ని కూడా పెంచుతాయి. 
 

click me!