ఆరోగ్యానికి మంచి పోషకవిలువలుండే ఆహారం ఎంతో ముఖ్యం. అందులోనూ అనారోగ్యానికి గురైన సమయంలో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా లభించే ఆహారాన్నే తీసుకోవాలి. అప్పుడే ఆ రోగాల నుంచి త్వరగా కోలుకోగలుగుతాం. తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్లో మంచి పోషకాలుంటాయి. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్, మసాలలు అధికంగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ జోలికి అస్సలు వెల్లకూడదు.