ఎప్పటికీ యవ్వనంగా ఉండే చిట్కా.. ఇవి పాటిస్తే చాలు అందమే అందం!

Navya G   | Asianet News
Published : Jan 18, 2022, 02:28 PM IST

అధిక మొత్తంలో పోషకాలు కలిగి ఉండే వాటిలో బాదం నూనె (Almond oil) చాలా విశిష్టమైనది. ఇందులో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి, జుట్టుకు కావలసిన పోషకాలను అందుతాయి. దీంతో చర్మం, జుట్టు సమస్యలు తగ్గుతాయి. బాదం నూనె మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. బాదం నూనెతో చర్మ, జుట్టు సౌందర్యానికి కలిగే ప్రయోజనాల (Benefits) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..      

PREV
17
ఎప్పటికీ యవ్వనంగా ఉండే చిట్కా.. ఇవి పాటిస్తే చాలు అందమే అందం!

బాదం నూనెలో బయోటిన్, విటమిన్ ఇ,  మెగ్నీషియం, కాపర్, విటమిన్ బి1, పాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ ఏజింగ్ లక్షణాలు (Anti-aging properties) సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
 

27

బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ (Vitamin E) చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నూనె చర్మానికి మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడి దేహకాంతిని పెంచుతుంది. ముఖంపై ఏర్పడిన మొటిమలు, నల్లటి మచ్చలు, ముడతలను తొలగించి మంచి నిగారింపును అందిస్తుంది. ఇలా బాదం నూనె చర్మ, జుట్టు సౌందర్యానికి అందించే ప్రయోజనాలు అనేకం.
 

37

కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది: బాదం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వలయాలను తగ్గించడానికి సహాయపడుతాయి. కనుక బాదం నూనెను (Almond oil) కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలపై (Black circles) అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

47

వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది: బాదం నూనెలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించడానికి సహాయపడుతాయి. బాదం నూనెలో (Almond oil) తేనె (Honey) కలిపి ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే వృద్ధాప్య  లక్షణాలు తగ్గుతాయి.
 

57

పొడి చర్మ సమస్యలను తగ్గిస్తుంది: పొడి చర్మ సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఫేస్ క్రీమ్ (Face cream) ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులో కొన్ని చుక్కల బాదం నూనెను  (Almond oil) వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి కావలసిన తేమ అంది పొడి చర్మ సమస్యలు తగ్గుతాయి.
 

67

చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది: బాదం నూనెలో  (Almond oil) కొద్దిగా నిమ్మరసాన్ని (Lemon juice) కలిపి తలకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.
 

77

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: బాదం నూనెను కనీసం వారానికి ఒకసారైనా అప్లై చేసుకుంటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టుకు కావలసిన పోషకాలను అందించి జుట్టు పెరుగుదలను (Hair growth) ప్రోత్సహిస్తుంది. ఈ నూనె జుట్టుకు మంచి కండిషనర్ (Conditioner) గా సహాయపడి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

click me!

Recommended Stories